Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియాకు ఐటీశాఖ భారీ షాక్‌.. కస్టమర్‌కు రూ. 27 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

|

Sep 12, 2021 | 1:23 PM

Vodafone Idea: ముందే కష్టాల్లో ఉన్న వోడాఫోన్‌ ఐడియాకు భారీ షాక్‌ తగిలింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ నష్టాల్లో కూరుకుపోతున్న వోడాఫోన్‌ ఐడియాకు..

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియాకు ఐటీశాఖ భారీ షాక్‌.. కస్టమర్‌కు రూ. 27 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
Follow us on

Vodafone Idea:ముందే కష్టాల్లో ఉన్న వోడాఫోన్‌ ఐడియాకు భారీ షాక్‌ తగిలింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ నష్టాల్లో కూరుకుపోతున్న వోడాఫోన్‌ ఐడియాకు రాజస్థాన్‌ ఐటీ శాఖ గట్టి షాకిచ్చింది. ఓ కస్టమర్‌కు ఏకంగా 27.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తగిన విధంగా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ చేయకుండానే డూప్లికేట్ సిమ్ జారీ చేయటంతో వోడాఫోన్‌ఐడియాకు ఈ చెల్లింపు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. 2017, మే 25న కృష్ణ లాల్ నైన్ అనే వ్యక్తి రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ వోడాఫోన్ స్టోర్‌కి వెళ్లి డూప్లికేట్ సిమ్ కోసం అభ్యర్థన చేసుకున్నాడు. కొత్త సిమ్ అయితే వచ్చిందిగానీ అది యాక్టివేట్ కాలేదు. సిమ్‌ యాక్టివేట్‌ కోసం పదేపదే ఫిర్యాదు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇక చివరకు జైపూర్‌కి వెళ్లి వోడాఫోన్ వారికి ఫిర్యాదు చేయగా, మరునాడు సిమ్ యాక్టివేట్ అయ్యింది. కానీ ఈ లోపు భాను ప్రతాప్ అనే మరో వ్యక్తి కృష్ణలాల్ నంబర్‌తోనే డూప్లికేట్ సిమ్ సంపాదించి పలు ఓటీపీల ద్వారా 68.5 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు.

ఈ ఘటన మే 25, 2017 జరిగింది. దీంతో జూన్‌ 2, 2017న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తన ఐడీబీఐ బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ అయిన సంగతి తెలుసుకున్న బాధితుడు వోడాఫోన్ ఐడియా కంపెనీపై పోరాటం చేసేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రమించాడు. సరైన విధంగా డాక్యుమెంట్స్ ఏవీ వెరిఫికేషన్ చేయకుండానే డూప్లికేట్ సిమ్ ఇచ్చినందుకు నష్ట పరిహారం కోరాడు. కృష్ణలాల్ నైన్‌కి మొత్తం 68.5 లక్షల్లో దాదాపు 44 లక్షలు భాను ప్రతాప్ తిరిగి ఇచ్చాడు. మిగిలిన 27.5 లక్షలు వోడాఫోన్ చెల్లించాలని తాజాగా రాజస్థాన్ ఐటీ శాఖ ఆదేశించింది.

రూ.68 లక్షలలో అతను రూ.44 లక్షలు కస్టమర్‌కు తిరిగి ఇచ్చాడు. అయితే మిగిలిన మొత్తం పెండింగ్‌లో ఉంది మరియు ఐటి చట్టం కింద కస్టమర్ దీని గురించి మరొక ఫిర్యాదు చేశారు. కాగా, అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న బాధితుడికి ఎట్టకేలకు ఇప్పుడు న్యాయం జరిగింది.

ఇవీ కూడా చదవండి: India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఈ పనులు చేయవచ్చు

Atal Beemit Vyakti Kalyan Yojana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు గూడ్‌న్యూస్‌

PF Customers: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఆ గడువు డిసెంబర్‌ 31 వరకు పొడిగింపు..!