
ప్రతి రైలు ప్రయాణీకుడు ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య వెయిటింగ్ లిస్ట్. చాలా మంది ప్రయాణీకులు రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు, అది వెయిటింగ్ లిస్ట్‌ను చూపిస్తుంది. టిక్కెట్లు కన్ఫర్మ్ అవుతాయో లేదో అని ప్రయాణికులు ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, రైల్వేలు ఇటీవల వెయిటింగ్ టిక్కెట్లపై గణాంకాలు, నియమాలను విడుదల చేశాయి, దీని వలన టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అంచనా వేయడం సులభం అవుతుంది.
ఏ తరగతిలోని మొత్తం సీట్లలో వెయిటింగ్ టిక్కెట్లు 25 శాతానికి మించరాదని రైల్వేలు స్పష్టం చేశాయి. ఒక కోచ్‌లో 100 సీట్లు ఉంటే, వెయిటింగ్ లిస్ట్ 25 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. మహిళలు, వికలాంగులైన ప్రయాణీకులకు ఉపశమనం కల్పించడం ఈ రూల్ లక్ష్యం. ఈ వ్యవస్థ రద్దీని తగ్గిస్తుందా లేదా అనేది సందేహమే అయినప్పటికీ, ఇది కచ్చితంగా టికెట్ బుకింగ్‌ను మరింత పారదర్శకంగా చేస్తుంది. రైల్వేల నుండి స్పష్టత చాలా అవసరం, ఎందుకంటే చాలా యాప్‌లు నిర్ధారణ అవకాశాలను చూపుతాయి. అయితే అవి చాలా సార్లు కచ్చితమైనవి కావు. భారతీయ రైల్వేలు కొన్ని సగటు గణాంకాలను పంచుకున్నాయి, దీని ఆధారంగా చాలా కచ్చితమైన అంచనా వేయవచ్చు.
ఉదాహరణకు ఒక స్లీపర్ కోచ్‌లో మొత్తం 72 సీట్లు ఉంటాయి. రైల్వేలు ఇచ్చిన ఫార్ములా ప్రకారం.. రద్దులు, అత్యవసర కోటాల కారణంగా దాదాపు 25 శాతం సీట్లు ఖాళీగా మారవచ్చు, అంటే దాదాపు 18 సీట్లు. అంటే స్లీపర్ కోచ్‌లో దాదాపు 18 వెయిటింగ్ లిస్ట్‌లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి