AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..! కన్ఫామ్‌ టిక్కెట్లపై రైల్వే శాఖ కొత్త రూల్స్‌

ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు టిక్కెట్ల రిజర్వేషన్ చార్ట్ ప్రయాణానికి 10 గంటల ముందుగానే సిద్ధం కానుంది. దీంతో ప్రయాణికులు తమ టికెట్ కన్ఫర్మేషన్ స్థితిని ముందుగానే తెలుసుకోవచ్చు. గతంలో 4 గంటల ముందు మాత్రమే తెలిసేది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..! కన్ఫామ్‌ టిక్కెట్లపై రైల్వే శాఖ కొత్త రూల్స్‌
Indian Railways Children's
SN Pasha
|

Updated on: Dec 17, 2025 | 3:32 PM

Share

రైలు ప్రయాణీకులకు బిగ్‌ రిలీఫ్‌ కలగనుంది. ఇప్పుడు రైలు ప్రయాణికులు తమ టిక్కెట్లు కన్ఫామ్‌ అయ్యాయో లేదో 10 గంటల ముందుగానే తెలుసుకోగలుగుతారు. దీనిపై రైల్వే శాఖ కొత్త ఉత్తర్వు జారీ చేసింది. రిజర్వేషన్ చార్ట్ ఇప్పుడు ముందుగానే తయారు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని వలన ప్రయాణీకులు సీట్ల లభ్యతను సకాలంలో తెలుసుకుంటారు. గతంలో ఈ పరిమితి నాలుగు గంటల ముందుగానే ఉండేది, ఇది రైలు ప్రయాణీకులకు కాస్త అసౌకర్యాన్ని కలిగించేది. కన్ఫామ్‌ కాని టిక్కెట్లు తరచుగా సమస్యలను కలిగిస్తాయి.

రైల్వే శాఖ ప్రకారం.. ఉదయం 5:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య నడిచే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్ట్ ముందు రోజు రాత్రి 8 గంటలలోపు తయారు చేస్తారు. రైలు ప్రయాణీకులు తమ టికెట్ కన్ఫామ్‌ సమాచారాన్ని చాలా ముందుగానే తెలుసుకోవచ్చు. తద్వారా వారు స్టేషన్‌కు చేరుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. మధ్యాహ్నం 2:01 నుండి రాత్రి 11:59 గంటల మధ్య, ఉదయం 12:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు నడిచే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్ట్ కనీసం 10 గంటల ముందుగానే తయారు చేయనున్నారు.

ఈ నిర్ణయం సుదూర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. వారు తమ టిక్కెట్ల స్థితిని సకాలంలో తెలుసుకోగలుగుతారు. అన్ని జోనల్ రైల్వేలు, సంబంధిత అధికారులకు దీనిని అమలు చేయమని సూచనలతో ఈ ఉత్తర్వు జారీ చేశారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రైల్వేలు చాలా నెలలుగా ఈ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నాయి. జూన్ చివరిలో రిజర్వేషన్ చార్టుల కోసం నియమాలను మార్చాలని రైల్వేలు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి