పండుగ సీజన్‌లో రైలు టికెట్స్ కన్ఫర్మ్ కావడం కష్టమైన పని. పండగ సమయంలో రద్దీ ఎక్కువ ఉండటంతో త్వరగా టికెట్స్ కన్ఫర్మ్ కావు. ఈ సమయంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుంది. మీరు టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేయడం నేరమే. ఒక వేళ టికెట్ లేకుండా పట్టుబడితే టీటీఈ మీకు జరిమానా విధించవచ్చు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు జైలు శిక్షను కూడా విధించవచ్చు. ఒక వేళ మీరు టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం.
ఏ సెక్షన్ కింద జరిమానా విధిస్తారు?
రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 137, 138 టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై జరిమానాలను విధించేందుకు ఈ సెక్షన్లను రూపొందించారు.
జరిమానా ఎంత?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మీరు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తూ పట్టుబడితే, మీరు రూ. 250 వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనితో పాటు, మీ టిక్కెట్ పూర్తి ధర కూడా జరిమానాగా రికవరీ చేస్తారు.
ఈ పరిస్థితిలో అధిక జరిమానా విధించవచ్చు
ఒక ప్రయాణికుడు రైలు ప్రయాణంలో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే, అతను ఎక్కడ నుండి రైలు ఎక్కాడు అనేది స్పష్టంగా తెలియకపోతే, రైలు ఏ స్టేషన్ నుంచి ప్రారంభమై ఏ స్టేషన్ వరకు ముగింపు ఉంటుందో అక్కడికి అయ్యే ఛార్జీని పెనాల్టీగా వసూలు చేస్తారు.
ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ పెనాల్టీని తగ్గించవచ్చు
అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు రైలు ఎక్కే స్టేషన్ నుంచి ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలి. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ మీరు ఏ స్టేషన్ నుండి రైలు ఎక్కారో తెలిసిపోతుంది.
జరిమానా చెల్లించిన తర్వాత సీటు పొందవచ్చా?
టికెట్ లేని ప్రయాణీకుడు జరిమానా చెల్లిస్తే, అతనికి కన్ఫర్మ్ సీటు లభిస్తుందనేది కాదు. అయితే, ఇది టీటీఈపై ఆధారపడి ఉంటుంది. రైలులో సీటు ఖాళీగా ఉంటే, దానిని ప్రయాణికుడికి కేటాయించవచ్చు.
మీరు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లయితే ఈ పని చేయండి
టికెట్ లేని పక్షంలో కేవలం ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకుంటే సరిపోదు. ఏదైనా పెద్ద అసౌకర్యాన్ని నివారించడానికి మీరు ప్రయాణం ప్రారంభించిన వెంటనే టీటీఈని సంప్రదించి మీ పరిస్థితిని అతనికి తెలియజేయాలి. ఇలా చేయడం ద్వారా, మీకు బెర్త్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మీకు ఏవైనా అనవసరమైన అవాంతరాలు కూడా తొలగిపోతాయి.
నేరుగా జైలుకు..
రైల్వే నిబంధనల ప్రకారం, మీరు టికెట్ లేకుండా పట్టుబడితే, టీటీఈ మీ వాదనలతో సంతృప్తి చెందకపోతే, మీకు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, లేదా రూ. 1,000 వరకు జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ కూడా విధించవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price Increase: యుద్ధ సమయంలో రూ.26 వేలు పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి