
బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు చేయడం మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. జీతం అందుకోవడం నుండి బిల్లులు చెల్లించడం వరకు ప్రతిదీ బ్యాంక్ అకౌంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. అయితే సడన్‌గా మీ అకౌంట్ క్లోజ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి? వామ్మో.. పనుల్ని ఆగిపోయతాయని కదూ. లక్షలాది మంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. నవంబర్ 30లోపు వారి KYC అప్డేట్ చేయకుంటే, వారి సేవింగ్స్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని బ్యాంక్ స్పష్టంగా హెచ్చరించింది.
KYC తప్పనిసరి బ్యాంకింగ్ ప్రక్రియ, దీని ద్వారా బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపు, చిరునామాను ధృవీకరిస్తాయి. మోసాన్ని నిరోధించడం, మనీలాండరింగ్‌ను అరికట్టడం ఆర్థిక నేరాలను నిరోధించడం. ఖాతాలు సరైన వ్యక్తి పేరు మీద ఉన్నాయని బ్యాంకులు నిర్ధారిస్తాయి. కస్టమర్ సమాచారం పాతది లేదా అప్డేట్ కాకుండా ఉంటే బ్యాంక్ వారిని KYC చేయమని అడుగుతుంది. KYC పెండింగ్‌లో ఉన్న తన కస్టమర్లందరికీ PNB స్పష్టమైన సూచనలు జారీ చేసింది. నవంబర్ 30 నాటికి మీరు మీ పత్రాలను అప్డేట్ చేయకుంటే, బ్యాంక్ మీ ఖాతాను “నాన్-ఆపరేటివ్” కేటగిరీలో ఉంచనుంది. ఒక వేళ అలా చేస్తే మీ అకౌంట్లో లక్షలు ఉన్నా కూడా ఒక్క రూపాయి వినియోగించుకోలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి