Bank Rules: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గింపు.!

|

Apr 05, 2022 | 5:55 PM

ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ పీఎన్‌బీ కీలక నిర్ణయం...

Bank Rules: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గింపు.!
Banks
Follow us on

ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ పీఎన్‌బీ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 10 లక్షలలోపు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి 2.70 శాతానికి తగ్గించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. అదే సమయంలో రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్‌లు మెయింటైన్ చేసే ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి 2.75 శాతానికి తగ్గించింది. కొత్త రేట్లు ఏప్రిల్ 4వ తేదీ నుంచి అమలులోకి రాగా.. ఈ రూల్స్ దేశీయ, ఎన్ఆర్ఐ కస్టమర్లకూ వర్తిస్తాయని PNB అఫీషియల్ ప్రకటన‌ ద్వారా తెలియజేసింది. ఈ కొత్త నిర్ణయం ద్వారా లక్షలాది డిపాజిటర్లపై ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా రూ. 10 లక్షలు, అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు ఎఫెక్ట్ పడుతుంది.

రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి:

ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్లపై పీఎన్‌బీ వడ్డీ రేట్లు తగ్గించడం.. గత రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. అంతకుముందు, ఫిబ్రవరిలో, ప్రభుత్వ రంగ సెక్టార్ బ్యాంకులు తమ కస్టమర్ల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గింపును ప్రకటించారు. రూ. 10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు వడ్డీ రేటు 2.75 శాతంగా.. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్లలోపు ఉన్న పొదుపు ఖాతాలకు ఏడాదికి 2.80 శాతం వడ్డీగా నిర్ణయించాయి. అటు మినిమిమ్ బ్యాలెన్స్ విషయంలోనూ పీఎన్‌బీ పెనాల్టీలను భారీగా పెంచింది. రూ. 100 జరిమానా.. రూ. 250కి మార్చింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(QAB) పరిమితిని రూ. 5,000కు పెంచింది. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో నగరాలతో సహా అన్ని ప్రాంతాలలో PNB.. లాకర్ ఛార్జీలను సైతం పెంచేసింది.

చెక్కుల చెల్లింపుపై కొత్త రూల్:

ఏప్రిల్ 4వ తేదీ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కుల చెల్లింపులపై కొత్త రూల్ అమలులోకి తీసుకొచ్చింది. రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ చెక్కు చెల్లింపుల కోసం కంపల్సరీ పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ని అమలు చేసింది. ఈ నిబంధన కారణంగా చెక్కు మోసాలు తగ్గుతాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.youtube.com/c/Money9Telugu