
వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు వ్యాపారం మొదలుపెట్టాలని ఆశతో ఉంటారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు వ్యాపారానికి కావాల్సిన నిధులు లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. లోన్ కోసం చూస్తుంటారు. అయితే బ్యాంకులు వసూలు చేసే అధిక వడ్డీకి భయపడి కూడా వెనుకడుడు వేస్తుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసమే ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం 2015లో పీఎం ముద్ర యోజన పేరుతో ఓ పథాకన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంతో వ్యాపారం చేయాలనుకునే వారికి రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఈ రుణం తీసుకునేందుకు ఏ విధమైన సెక్యూరిటీ లేదా కొల్లాటెరల్ సెక్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి షరతులు లేకుండానే రుణం పొందే అవకాశం కల్పించారు.
ముద్ర యోజన లోన్‌ను మొత్తం మూడు కేటగిరీల్లో ఇస్తారు.ఇందులో మొదటిది శిషు లోన్. ఈ కేటగిరీలో రూ. 50 వేల వరకు రుణాన్ని అందిస్తారు. రెండోది కిశోర్ లోన్ ఇందులో రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇక మూడోది తరుణ్ లోన్ ఇందులో రూ. 10 లక్షల వరకు రుణాన్ని అందిస్తారు. లోన్ కేటగిరీ అనేది వ్యాపారంపై ఆధారపడి ఉంటుంది.
ఇక ముద్రలోన్ యోజనకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. అలాగే అంతకు ముందు ఎలాంటి బ్యాంక్ డీఫాల్ట్ హిస్టరీ ఉండకూడదు. దరఖాస్తు దారుడు వయసు కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ రుణం పొందడానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం ఉండదు. రుణం తీసుకున్న తర్వాత తిరిగి రుణాన్ని ఏడాది నుంచి 5 ఏళ్లు వరకు తిరిగి చెల్లించవచ్చు. ఒకవేళ 5 ఏళ్లలో తిరిగి చెల్లించకపోతే మరికొంత కాలం కూడా పొడిగించుకోవచ్చు. ఇక లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, ఐటీ రిటర్న్స్ కాపీ, సెల్ఫ్ ట్యాక్స్ రిటర్న్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటాయి. పూర్తి వివరాలు, లోన్ దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..