PM Mudra Yojana: రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండిలా.. పూర్తి వివరాలు..!

|

Oct 09, 2021 | 1:57 PM

PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. దేశంలో స్వయం ఉపాధిని పెంపొందించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన..

PM Mudra Yojana: రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండిలా.. పూర్తి వివరాలు..!
Pm Mudra Yojana
Follow us on

PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. దేశంలో స్వయం ఉపాధిని పెంపొందించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఈ స్కీమ్‌లో మొదటి దశలో ఎందరికో ఆసరాగా నిలిచింది. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం.

దీని ద్వారా అర్హత కలిగిన వారు సులభంగానే రుణం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్‌ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి అర్హులు.

ఇవీ కూడా చదవండి:

Monthly Pension: రూ.5292 సిప్ చేస్తే.. నెలకు రూ.1.50 లక్షల పెన్షన్‌ పొందవచ్చు..!

Post Office Schemes: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అదిరిపోయే బెనిఫిట్స్‌.. రెట్టింపు ఆదాయం..!

CoWIN App: కోవిన్ పోర్టల్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా.. అందులో ఏముంటుంది!