PM Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ యోజన అకౌంట్‌ ఉందా..? ఎన్నో ప్రయోజనాలు.. ఖాతాలో బ్యాలెన్స్‌ లేకున్నా రూ.10వేలు తీసుకోవచ్చు!

|

May 18, 2022 | 12:46 PM

PM Jan Dhan Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్‌ వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది...

PM Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ యోజన అకౌంట్‌ ఉందా..? ఎన్నో ప్రయోజనాలు.. ఖాతాలో బ్యాలెన్స్‌ లేకున్నా రూ.10వేలు తీసుకోవచ్చు!
Follow us on

PM Jan Dhan Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్‌ వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన పథకం ఒకటి. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) 2014 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్దిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, పైవేట్‌ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయవలసిన అవసరం లేదు. అంతేకాదు జన్‌ ధన్‌ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్‌ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు.

అలాగే ఈ ఖాతా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఖాతా నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ డెబిట్‌ కార్డుద్వారా మీరు ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. కొనుగోళ్లు కూడా నిర్వహించవచ్చు. ఈ జన్ ధన్ యోజన కింద10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతాను తెరవవచ్చు.

రూ.2 లక్షల ప్రమాద బీమా.. రూ.30 వేల జీవిత బీమా:

ఇవి కూడా చదవండి

ఈ పథకం కింద ఖాతా తెరిచినప్పుడు మీరు రూపే ATM కార్డ్, రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా, డిపాజిట్ మొత్తంపై వడ్డీ పొందుతారు. మీరు దీనిపై 10 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ ఏదో ఒకటి ఉండాలి. మీకు ఈ పత్రాలు లేకపోతే మీరు చిన్న ఖాతాను కూడా ఓపెన్ చేసే సౌకర్యం ఉంది. ఇందులో మీరు బ్యాంకు అధికారి ముందు ఒక ఫోటో, ఫారమ్‌ నింపి సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం గతంలో రూ.5000 ఉండగా, దానిని కేంద్ర ప్రభుత్వం రూ.10,000 పెంచింది. భారతదేశంలో నివసించే పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.ఈ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి, మీ జన్ ధన్ ఖాతా తెరిచి కనీసం 6 నెలలై ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి