Post office Scheme: పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు శుభవార్త.. ఈ స్కీమ్‌పై ప్రతి ఏడాది రూ. లక్షకుపైగా పొందొచ్చు!

|

Sep 22, 2022 | 9:00 AM

Post office Scheme: పోస్టాఫీసులో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. ఒకప్పుడు లెటర్లకే..

Post office Scheme: పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు శుభవార్త.. ఈ స్కీమ్‌పై ప్రతి ఏడాది రూ. లక్షకుపైగా పొందొచ్చు!
Post Office Scheme
Follow us on

Post office Scheme: పోస్టాఫీసులో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. ఒకప్పుడు లెటర్లకే పరిమితమైన పోస్టాఫీసులు.. ప్రస్తుతం బ్యాంకుల వలే అన్ని సేవలు అందిస్తున్నాయి. పోస్టాఫీసులను మరింతగా మెరుగు పర్చడంలో వివిధ రకాల సేవలను పొందుతున్నారు ప్రజలు. పోస్ట్ ఆఫీస్ పెట్టుబడికి మంచి ఆదరణ ఉంది. ఇది మనీ గ్యారెంటీతో పాటు మంచి రాబడిని కూడా ఇస్తుంది. పోస్టాఫీసులు మంచి రాబడి వచ్చే పథరకాలు ఉన్నాయి. మీరు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినట్లయతే మీరు ప్రతి సంవత్సరం రూ. 1,11,000 పొందుతారు. ఈ పథకం ఏంటో తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్:

పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్‌కు చెందిన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్రభుత్వ పథకంలో, మీరు 7.4 శాతం వడ్డీతో ప్రయోజనం పొందుతున్నారు. దీనితో పాటు, వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంది. ఇందులో వడ్డీ మొత్తం కూడా మారవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో మంచి రాబడితో పాటు, మీరు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు

ఇవి కూడా చదవండి

మీరు ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

మీరు ఈ ప్రభుత్వ పథకంలో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఇందులో మీరు గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు. అయితే ఖాతాదారులు ఈ పథకాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు

80C ఆదాయపు పన్ను కింద మీరు 1.5 లక్షల వరకు మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అదే సమయంలో, మీరు పొందే వడ్డీ 50,000 కంటే ఎక్కువ ఉంటే మీరు దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 1,11,000 ఎలా పొందాలి:

ఒక పెట్టుబడిదారుడు రూ. 15 లక్షలు అంటే గరిష్ట మొత్తాన్ని ఈ ప్రభుత్వ పథకంలో డిపాజిట్ చేస్తే 7.4 శాతం వడ్డీ పొందవచ్చు. దీంతో సదరు పెట్టుబడిదారుడు ప్రతి త్రైమాసికంలో రూ. 27750 పొందుతాడు. అదే సమయంలో దాని వార్షిక మొత్తం రూ. 1,11,000 అవుతుంది. మీరు ఉమ్మడి ఖాతాను తెరిస్తే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలకు పెరుగుతుంది. పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేసిన తర్వాత, వడ్డీ రూ. 2.2 లక్షలకు రెట్టింపు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి