Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!

|

Jan 03, 2022 | 6:42 AM

Post Office Scheme: పోస్టాఫీసుల్లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి అవకాశాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ ఎన్నో ఉన్నాయి. ఈ కొత్త ఏ..

Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!
Follow us on

Post Office Scheme: పోస్టాఫీసుల్లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి అవకాశాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ ఎన్నో ఉన్నాయి. ఈ కొత్త ఏడాదిలో మంచి లాభాలు పొందాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌శాఖలో మంచి లాభాలు వచ్చే స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా గ్రామ సురక్ష పథకం (Gram Suraksha Scheme). ఈ స్కీమ్‌లో చేరి ప్రతి నెల రూ.1500 డబ్బులు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత రూ.35 లక్షలు పొందే అవకాశం ఉంటుది.

ఈ పథకానికి ఎవరెవరు అర్హులు:
ఈ స్కీమ్‌లో చేరడానికి 15 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు అర్హులు. 19 సంవత్సరాల నుంచి పెట్టుబడితో ప్రారంభించి రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేస్తే 55 ఏళ్ల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515, 58 ఏళ్లకు రూ.1463, 60 ఏళ్లకు రూ.1411 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక 55 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేస్తే పెట్టుబడిదారుడికి రూ.31.60 లక్షలు చేతికి అందుతాయి. 58 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల తర్వాత రూ.34.60 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్‌లో అదనంగా జీవిత బీమా బెనిఫిట్స్‌ కూడా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడిని మూడు నెలలు, ఆరు నెలల ప్రతిపాదికన పెట్టవచ్చు.

పాలసీ సరెండర్‌..
పాలసీదారులు పెట్టుబడి పెట్టిన తర్వాత రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్‌ చేయవచ్చు. ఇన్వెస్టర్‌ ఏదైనా కారణం తర్వాత మరణిస్తే నామినీకి లేదా వారసుడికి డబ్బులు చెల్లిస్తారు. ఆదాయపు పన్ను చట్టం, 1960లోని సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 88 కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

PAN Card: మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నాయా..? జాగ్రత్త.. ఇబ్బందుల్లో పడ్డట్లే..!

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ విషయాలను గుర్తించుకోండి.. లేకపోతే కష్టాల్లో ఇరుక్కున్నట్లే..!