Post Office Savings Scheme: ఈ స్కీమ్‌లో రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.16 లక్షలు.. పూర్తి వివరాలు..!

|

Sep 22, 2021 | 6:13 PM

Post Office Savings Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పోస్టు లేటర్లకే పరిమితమైన పోస్టల్‌ శాఖ.. తాజాగా బ్యాంకుల..

Post Office Savings Scheme: ఈ స్కీమ్‌లో రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.16 లక్షలు.. పూర్తి వివరాలు..!
Follow us on

Post Office Savings Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పోస్టు లేటర్లకే పరిమితమైన పోస్టల్‌ శాఖ.. తాజాగా బ్యాంకుల మాదిరిగానే ఎన్నో స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. పోస్టాఫీసులలో డబ్బులు పెట్టడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. పోస్టాఫీసులో ఉన్న స్కీమ్‌లలో పోస్ట్‌ ఆఫీసు రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఒకటి. ఇందులో రూ.100 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇందులో ప్రతి నెల డబ్బులు పెడుతూ ఉండాలి. పోస్ట్‌ ఆఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా అనేది ప్రభుత్వం హామీ ఇచ్చే స్కీమ్‌. ఈ స్కీమ్‌లో చిన్న మొత్తాలను వాయిదాలలో జమ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడులకు మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తోంది పోస్టల్‌ శాఖ. ఈ పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్‌ గడువు ఐదేళ్లు.

ఈ స్కీమ్‌లో వడ్డీ రేట్లు..

పోస్టాఫీసులు అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్‌లలో ఇది ఒకటి. ఇందులో పెట్టుబడి పెడితే 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ఏప్రిల్‌ 1,2020 నుంచి అమల్లోకి వచ్చింది. మీరు ప్రతినెలా రూ.10 వేల చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తే వడ్డీ రేటు 5.8 శాతంలో పది సంవత్సరాల తర్వాత మీకు మొత్తం రూ.16 లక్షలు చేతికి అందుతాయి.

ఆలస్యంగా ఇన్వెస్ట్‌ చేస్తే పెనాల్టీ..

ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా నెలనెల చెల్లించకపోతే అందుకు పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా కారణాల చేత మీరు వరుసగా నాలుగు నెలల పాటు డబ్బులు జమ చేయకుండా ఉంటే ఏకంగా ఖాతాను మూసివేస్తారు. రెండు నెలల తర్వాత తిరిగి ఖాతా పొందే అవకాశం ఉంటుంది. కానీ మరింత ఆలస్యంగా స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తే శాశ్వతంగా ఖాతాను మూసివేస్తారు.

ఏడాది తర్వాత డిపాజిట్‌ బ్యాలెన్స్‌లో విత్‌డ్రా..

కాగా, ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వినియోగదారుడు ఖాతా తెరిచిన ఏడాది తర్వాత డిపాజిట్‌ బ్యాలెన్స్‌లో 50 శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వేళ మీరు ఈ మొత్తాన్ని ఆరు నెలల్లో ఉపసంహరించుకోవాడానికి పోస్టాఫీసు అనుమతి ఇస్తుంది. ఈ స్కీమ్‌ ప్రారంభించిన తర్వాత కస్టమర్‌ చనిపోయినట్లయితే నామినీకి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.

ఇవీ కూడా చదవండి:

43 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్లు.. ఇప్పుడు దాని విలువ రూ.1448 కోట్లు.. క్లెయిమ్‌ కోసం పోరాటం..!

Gram Suraksha Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు..!