Post Office Schemes: నెలనెలా రూ.250 చెల్లించండి.. అత్యధిక వడ్డీ పొందండి.. వారికి మాత్రమే ఛాన్స్‌..

|

May 23, 2022 | 8:23 AM

మీరు రాబోయే రోజుల్లో సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు చక్కటి ఎంపిక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లు(Post Office Schemes)...

Post Office Schemes: నెలనెలా రూ.250 చెల్లించండి.. అత్యధిక వడ్డీ పొందండి.. వారికి మాత్రమే ఛాన్స్‌..
Post Office
Follow us on

మీరు రాబోయే రోజుల్లో సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు చక్కటి ఎంపిక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లు(Post Office Schemes). పోస్టాఫీస్‌ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒక్కటి. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తిగా సురక్షితం. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు కేవలం ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు. ఇది కాకుండా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ(Interest) రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుండి వర్తిస్తుంది. ఈ పథకంలో వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు.

పోస్టాఫీసు ఈ చిన్న పొదుపు పథకంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 మరియు గరిష్ఠంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఒకే మొత్తంలో డిపాజిట్ చేయవచ్చు. ఒక నెల లేదా ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల సంఖ్యపై పరిమితి లేదు. పోస్టాఫీసు ఈ పథకం కింద, ఒక సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద మాత్రమే ఖాతాను తెరవవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతాను తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. ఈ పథకంలో 18 సంవత్సరాల వయస్సు తర్వాత ఆడపిల్ల పెళ్లి సమయంలో ఖాతాను మూసివేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు కోసం క్లెయిమ్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..