Post Office Deposit: పోస్టాఫీసులో అదిరిపోయే డిపాజిట్‌ పథకం.. నెలకు 1000 డిపాజిట్‌ చేస్తే రూ.72 వేలు వడ్డీ పొందవచ్చు.. ఎలాగంటే..!

|

Apr 03, 2021 | 9:59 AM

Post Office Deposit: పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది పోస్టాల్‌ శాఖ. పోస్టాఫీసుల్లో పొదుపు చేసినట్లయితే అధిక వడ్డీలు చెల్లిస్తూ పెద్ద పెద్ద మొత్తంలో..

Post Office Deposit: పోస్టాఫీసులో అదిరిపోయే డిపాజిట్‌ పథకం.. నెలకు 1000 డిపాజిట్‌ చేస్తే రూ.72 వేలు వడ్డీ పొందవచ్చు.. ఎలాగంటే..!
Follow us on

పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది పోస్టాల్‌ శాఖ. పోస్టాఫీసుల్లో పొదుపు చేసినట్లయితే అధిక వడ్డీలు చెల్లిస్తూ పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులను అందజేస్తుంది. మీరు కూడా ఒక నిర్ణిత కాలానికి చిన్న మొత్తాన్ని జమ చేయడం ద్వారా అధిక మొత్తాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు డిపాజిట్‌ పథకంలో నెలకు వెయ్యి రూపాయలు జమ చేసినట్లయితే 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే  12,468.84 రూపాయలు వడ్డీ పొందవచ్చు. దీనిని ఐదు సంవత్సరాలకు పెంచుకుంటే అప్పుడు నెలకు వెయ్యి చొప్పున అంటే రోజుకు 33 రూపాయలు మాత్రమే. అంటే 60 వేలు మీరు పొదుపు చేసిన డబ్బులు కాగా, అంతా మొత్తానికి 7.10శాతం వడ్డీతో మీరు తీసుకోవచ్చు. 60 వేలు + 12,468.84 రూపాయల వడ్డీతో కలిపి ఐదు సంవత్సరాల మొత్తం అందుకోవచ్చు. ఇలా ఐదు సంవత్సరాల్లో రూ.72 వేల వరకు వడ్డీ లభిస్తుంది.

డబ్బులు ఎలా జమ చేయాలి..?

ఈ డిపాజిట్‌ పథకంలో భాగంగా ప్రయోజనం పొందేందుకు మీరు ప్రతి నెలా ఒక నిర్ణిత తేదీలో డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీరు ప్రతి నెల 1 నుంచి 15 వరకు జమ చేయవచ్చు. నెల 1న ఖాతా తెరిచినట్లయితే మీరు ప్రతినెల 15వ తేదీ వరకు జమ చేయవచ్చు.

ఇద్దరు వ్యక్తులు కలిసి ఖాతాను తెరవవచ్చు

పోస్టాఫీసు రికార్డింగ్‌ డిపాజిట్లో ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కూడా తెరవవచ్చు. ఈ ఖాతాను దేశంలోని ఏ పోస్టాఫీసు శాఖలోనైనా ఖాతాదారుడు కోరుకుంటే ఇద్దరు కలిసి ఈ ఖాతాను నడిపించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న తపాలా శాఖలు కూడా అనేక రకాల బ్యాంకింగ్‌, చెల్లింపుల సేవలను అందిస్తున్నాయి.

కాగా, పోస్టాఫీసులో పొదుపు పథకాలకు 4 శాతం నుంచి 8.3 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఈ పథకాలకు సంబంధించి ఇండియా పోస్టాఫీసు వెబ్‌ సైట్‌లలో పూర్తి సమాచారం లభిస్తుంది. లేదా మీ దగ్గరలోని పోస్టాఫీసు శాఖకు వెళితే పూర్తి వివరాలు తెలియజేస్తారు.

ఇవీ చదవండి:  Assam Election 2021 2nd Phase Voting LIVE: అసోంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్‌

Interest Rates: సామాన్యులకు కేంద్రం భారీ షాక్.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ వడ్డీ రేట్ల తగ్గింపు.. వివరాలు తెలుసా..?