Post Office: మగ పిల్లల కోసం బెస్ట్ సేవింగ్‌ స్కీమ్‌.. పూర్తి వివరాలు..

ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ అందించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ మొదటి స్థానంలో ఉంటుందని తెలిసిందే. పోస్టాఫీస్ మగ పిల్లల కోసం కూడా కొన్ని ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో కిసాన్‌ పత్ర పథకం ఒకటి. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకీ పోస్టాఫీస్‌ అందిస్తోన్న.....

Post Office: మగ పిల్లల కోసం బెస్ట్ సేవింగ్‌ స్కీమ్‌.. పూర్తి వివరాలు..
Post Office

Updated on: Apr 11, 2024 | 4:40 PM

ప్రతీ ఒక్కరూ సంపాదించే దాంట్లో ఎంతో కొంత సేవింగ్‌ చేయాలని చూస్తున్నారు. వారికి వచ్చే ఆదాయం ఆధారంగా ఎంత పొదుపు చేయాలో డిసైడ్‌ అవుతారు. అయితే చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంటారు. ఇందుకోసమే ప్రభుత్వాలు సైతం పలు రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే ఎక్కువగా బాలికల కోసం తీసుకొచ్చిన పథకాల గురించే తెలిసి ఉంటుంది. కానీ మగ పిల్లల కోసం ఒక కూడా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ అందించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ మొదటి స్థానంలో ఉంటుందని తెలిసిందే. పోస్టాఫీస్ మగ పిల్లల కోసం కూడా కొన్ని ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో కిసాన్‌ పత్ర పథకం ఒకటి. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకీ పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా పోస్ట్‌ అందిస్తోన్న ఈ పథకాన్ని 1988లో ప్రవేశపెట్టారు. మధ్య తరగతి కుటుంబాలకు సరిపోయేలా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక నిర్ధిష్ట మొత్తం పెట్టుబడి పెట్టుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరాలంటే 18 ఏళ్లు నిండాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1000 కాగా, గరిష్ఠంగా లిమిట్ అంటూ ఏం లేదు.

ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని మీరు ముందుగానే తీసుకోవచ్చు. వికాస్ పత్ర సర్టిఫికెట్‌ను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ఇక మెచ్యురిటీ పీరియడ్ విషయానికొస్తే 10 సంవత్సరాల 4 నెలలుగా నిర్ణయించారు. ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీరేటుకు తల్లిదండ్రులు లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..