PNB ONE: మొబైల్‌ నెంబర్‌ ద్వారానే బ్యాంకింగ్‌ సేవలు.. అనేక ఫీచర్లతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ యాప్‌..!

|

Aug 09, 2021 | 6:21 PM

PNB ONE: కరోనా మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్‌ ఊపందుకుంది. దాదాపు బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన అన్ని పనులు కూడా మొబైల్‌ ద్వారానే చేసుకునే వెసులుబాటు..

PNB ONE: మొబైల్‌ నెంబర్‌ ద్వారానే బ్యాంకింగ్‌ సేవలు.. అనేక ఫీచర్లతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ యాప్‌..!
Pnb
Follow us on

PNB ONE: కరోనా మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్‌ ఊపందుకుంది. దాదాపు బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన అన్ని పనులు కూడా మొబైల్‌ ద్వారానే చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ప్రస్తుతం అన్ని లావాదేవీలు, ఇతర పనులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే జరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్లే చేసేదానికంటే ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారానే లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. రోజురోజుకు డెవలప్‌ అవుతున్న టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకుంటున్నారు జనాలు. ఇక తాజాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా తన యాప్‌ ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పిస్తోంది. మొబైల్‌ నెంబర్‌ ద్వారానే ఇతరులకు డబ్బులు పంపుకోవచ్చు. PNB One నుంచి పే టు కాంటాక్ట్‌ సదుపాయాన్ని ఉపయోగించి మొబైల్‌ నెంబర్‌ ద్వారా డబ్బులు పంపుకోండి అంటూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ట్వీట్‌ చేసింది. PNB ONE అనేది ఏకీకృత మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌. ఇది ఒకే వేదికపై బ్యాకింగ్‌ సౌకర్యాలను అందించే అనేక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్రాంచ్‌ను సందర్శించకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 ఈ అప్లికేషన్‌ ద్వారా ప్రధాన బ్యాంకింగ్‌ అవసరాలను నిర్వహిచడానికి వినియోగదారునికి అనుమతి ఇస్తుంది. ఇది సెక్యూరిటీతో కలిగిన అప్లికేషన్‌. ఏవైనా లావాదేవీలు జరిపే ముందు బయోమెట్రిక్‌తోపాటు పాస్‌వర్డ్‌ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.

మొబైల్‌ యాప్‌ ఎలా ఉపయోగించాలి..?

ముందుగా ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి PNB ONE ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అకౌంట్ నెంబర్‌ ఎంటర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి. మీ బ్యాంకు డెబిట్‌ కార్డు నెంబర్‌, పిన్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవాలి. తర్వాత విజయవంతగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు యూజర్‌ ఐడితో సందేశం వస్తుంది. మీ యూజర్‌ ఐడీని నమోదు చేసి ఎంపీఐఎన్‌ను సెట్‌ చేసుకోవాలి. ఈ విధంగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మీ బ్యాంకింగ్‌ పనులను చేసుకోవచ్చని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తెలిపింది.

 

ఇవీ కూడా చదవండి

Reuben Singh: తలపాగా మ్యాచింగ్ కోసం 15కుపైగా రోల్స్ రోయిస్ కార్ల కొనుగోలు.. ఎవరు ఇతను?.. ఆయన ఛాలెంజ్ ఏంటి?

Hero Splendor: అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 22 వేల రూపాయలకే హీరో బైక్‌.. 81 కి.మీ మైలేజీ..!