PNB Instant Loan: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. బ్యాంకు తన ఖాతాదారులకు సులువుగా రుణాలు మంజూరు చేస్తోంది. మీరు కూడా PNB కస్టమర్ అయితే మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంక్ మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ని తీసుకొచ్చింది. తన ఖాతాదారులకు సులభంగా రూ.8 లక్షల రుణం మంజూరు చేస్తోంది. మీకు డబ్బు అత్యవసరమైతే ప్రత్యేక సదుపాయం కింద బ్యాంకు నుంచి ఈ డబ్బును సేకరించవచ్చు. నిజానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ‘ఇన్‌స్టా’ లోన్ ద్వారా తన కస్టమర్‌లకు రూ. 8 లక్షల వరకు రుణం మంజూరు చేస్తోంది. మీరు ఈ ఆఫర్ కింద వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ సమాచారం అందించడమే. తర్వాత రుణాన్ని సులభంగా పొందుతారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విధంగా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం ఫుడ్ ఆర్డర్ చేసినంత సులభం. మీరు తక్కువ వడ్డీ రేట్లతో వ్యక్తిగత రుణం కోసం చూస్తున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ Insta లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు tinyurl.com/t3u6dcnd లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
దీనికి ఎవరు అర్హులు..?
PNB సదుపాయాన్ని పొందేందుకు కస్టమర్ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా PSU ఉద్యోగి అయి ఉండాలి. ఈ రుణం నిమిషాల వ్యవధిలో మంజూరవుతుంది. ఈ లోన్ సౌకర్యం 24*7 అందుబాటులో ఉంటుంది. దీని కింద కస్టమర్లు రూ.8 లక్షల వరకు రుణాన్ని పొందుతారు. ఇందులో ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము ఉండదు.