PMSYM Scheme: రోజుకు రెండు రూపాయల పెట్టుబడితో నెలకు రూ. 3000 పెన్షన్‌.. ఈ సూపర్ పథకంపై ఓ లుక్కేయండి..

|

Dec 08, 2022 | 12:48 PM

దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తక్కువ పెట్టుబడితో బీమా, పెన్షన్‌ పథకాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌ యోజన..

PMSYM Scheme: రోజుకు రెండు రూపాయల పెట్టుబడితో నెలకు రూ. 3000 పెన్షన్‌.. ఈ సూపర్ పథకంపై ఓ లుక్కేయండి..
Pmsym Scheme
Follow us on

దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తక్కువ పెట్టుబడితో బీమా, పెన్షన్‌ పథకాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌ యోజన పేరుతో మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కార్మికులు రోజుకు కేవలం రూ. 2 పెట్టుబడి పెట్టడం ద్వారా ఏడాదికి రూ. 36,000 పెన్షన్ పొందొచ్చు.

ఈ పథకంలో చేరాలనుకునే వారు కచ్చితంగా ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఖాతా కలిగి ఉండాలి. ఈ పథకంలో చేరిన వారు ప్రతి నెల రూ. 55 చెల్లించాలి. చందాదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌ను స్వీకరిస్తారు. వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవని నిర్మాణ కార్మికులు వంటి అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌ పొందడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పథకంలో చేరే సమయంలో వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే రోజుకు రూ. 2 చెల్లించాల్సి ఉంటుంది.

అదే 40 ఏళ్ల వ్యక్తి అయితే ప్రతి నెలా రూ. 200 (రోజుకు రూ. 6.50) చెల్లించాల్సి ఉంటుంది. రూ. 15000 కంటే ఆదాయం ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకాన్ని తీసుకోవాలనుకునే వారు ఎల్‌ఐసీ, ఈపీఎప్‌వో సెంటర్లను సందర్శించవచ్చు. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ నెల నేరుగా చందాదారుడి ఖాతా నుంచి డబ్బులు వాటంతటవే కట్‌ అవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..