PM SVANidhi Schem: వీధి వ్యాపారుల రుణాలపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. ఆ గడువు 2024 డిసెంబర్‌ వరకు పొడిగింపు

|

Jan 07, 2023 | 5:05 PM

2023 లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో వీధి వ్యాపారులకు రూ.5,000 వరకు మైక్రో లోన్ సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని టెలికాం..

PM SVANidhi Schem: వీధి వ్యాపారుల రుణాలపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. ఆ గడువు 2024 డిసెంబర్‌ వరకు పొడిగింపు
Pm Svanidhi Scheme
Follow us on

2023 లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో వీధి వ్యాపారులకు రూ.5,000 వరకు మైక్రో లోన్ సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డిజిటల్ ఇండియా అవార్డు పంపిణీ కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2023లో రూ.3,000 నుంచి రూ.5,000 వరకు సూక్ష్మ రుణాల కోసం వీధి వ్యాపారుల అవసరాలను తీర్చేందుకు సులభమైన మార్గంలో రుణ సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

ప్రతి పౌరుడిని డిజిటల్‌గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు 4జీ, 5జీ టెలికాం సేవలను అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు రూ.52 వేల కోట్లను కేటాయించారని, ప్రతి పౌరుడిని డిజిటల్‌గా అనుసంధానం చేశారన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ టెక్నాలజీలజీ ఈ ఏడాది అమలు అవుతుందన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్‌ను స్వావలంబనగా మార్చాలన్న ప్రధాని మోదీ దార్శనికత మేరకు దేశంలో అతి త్వరలో ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పీఎం స్వానిధి పథకం చివరి తేదీ 2024 వరకు పొడిగింపు:

గత నెల డిసెంబర్‌లోనే ప్రధాన మంత్రి స్వానిధి యోజన డిసెంబర్ 2024 వరకు పొడిగించింది. ఇంతకు ముందు దీని చివరి తేదీ 31 మార్చి 2023 వరకు ఉండేది. ఈ పథకం కింద చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలు అందజేస్తారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ సెల్ఫ్-రిలెంట్ ఫండ్ (SVANidhi) పథకం జూన్ 2020లో మైక్రో లోన్ సౌకర్యంగా కేంద్రం ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వీధి వ్యాపారులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వారికి ఈ పథకం ఉపయోగపడనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి