
Gold Buying: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఏడాది పాటు బంగారం కొనవద్దని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న సంక్షోభం కారణంగా ముందు జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలిజేశారు. అయితే ఒకవేళ పౌరులు ఏడాది పాటు బంగారం కొనకపోతే, అది దేశ ఆర్థిక వ్యవస్థతో సహా పలు అంశాలపై ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. పెళ్లిళ్ల నుండి పెట్టుబడుల వరకు, భారతీయులకు బంగారంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. అయితే, మనం ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
విడుదలైన డేటా ప్రకారం.. భారతీయుల మొత్తం వార్షిక బంగారు డిమాండ్ సాధారణంగా 600 నుండి 800 టన్నుల మధ్య ఉంటుంది. 2025లో భారతదేశం మొత్తం బంగారు డిమాండ్ సుమారు 710.9 టన్నులుగా ఉంది. ఇందులో అత్యధిక వాటా ఆభరణాల కొనుగోలుదే కాగా, బంగారు కడ్డీలు, నాణేలు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో భారతదేశం బంగారు డిమాండ్ 151 టన్నులుగా ఉంది. ఇందులో ఆభరణాల కంటే పెట్టుబడుల వాటానే ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ జూన్ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్..!
భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, దానిని సంప్రదాయానికి, భద్రతకు చిహ్నంగా భావిస్తారు. దేశంలో ప్రతి సంవత్సరం వందలాది టన్నుల బంగారం కొనుగోలు చేయబడుతుంది. ప్రజలు పండుగలు, వివాహాలు, పెట్టుబడుల పేరిట పెద్ద మొత్తంలో బంగారం కొంటారు. భారతదేశానికి అవసరమైన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల బంగారం దిగుమతులు పెరిగినప్పుడు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం దేశం నుండి బయటకు వెళ్ళిపోతుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా.. ప్రయాణికులు చేసే ఈ చిన్న పొరపాటే కారణం..!
ప్రధానమంత్రి విజ్ఞప్తి మేరకు భారతీయులు ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలును తగ్గించినా లేదా పూర్తిగా నిలిపివేసినా దాని అతిపెద్ద ప్రభావం దేశ దిగుతుల బిల్లుపై పడుతుంది. బంగారం దిగుమతులు తగ్గడం వల్ల ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఇది డాలర్ డిమాండ్‌ను తగ్గించి, రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల భారతదేశ కరెంట్ ఖాతా లోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే దేశీయ డబ్బును విదేశాలకు తరలించకుండా, దేశీయ పెట్టుబడులు, అభివృద్ధి పనుల కోసం ఎక్కువగా ఉపయోగించవచ్చు.
భారతదేశంలో అధిక మొత్తంలో డబ్బు బంగారంపై పెట్టుబడి పెట్టబడుతుంది. దీనివల్ల ఆ డబ్బు నిరుపయోగంగా ఉంటుంది. ప్రజలు బంగారం కొనడానికి బదులుగా బ్యాంకు ఎఫ్‌డీలు, ఎస్‌ఐపీలు, స్టాక్ మార్కెట్ లేదా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల బ్యాంకులకు మరింత మూలధనం అందుబాటులోకి వస్తుంది. అలాగే పరిశ్రమలకు రుణాలు లభిస్తాయి. ఇది ఉపాధిని కూడా పెంచగలదు.
మరోవైపు, బంగారం కొనుగోళ్లను నిలిపివేయడం ఆభరణాల పరిశ్రమపై ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని ఆభరణాల పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఒకవేళ ఏడాది పాటు బంగారం డిమాండ్ అకస్మాత్తుగా పడిపోతే, ఆభరణాల దుకాణదారులు, కళాకారులు, చిన్న వ్యాపార యజమానులు భారీ నష్టాలను చవిచూడవచ్చు. అంటే బంగారం కొనకూడదని నిర్ణయించుకోవడంలో లాభనష్టాలు రెండూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి