PM Kisan Yojana: దేశంలో మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు పథకాలను రూపొందిస్తూ అండగా నిలుస్తోంది. ఇక కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్’ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు కొంత ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదిలో మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంటుంది. ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ విడత డబ్బులు సెప్టెంబర్‌లో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇక ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పథకం కింద సాయం అందుకుంటున్న రైతులు కూడా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈకేవైసీ లేకుంటే 12వ విడత డబ్బులు రావు
ఒక వేళ మీరు ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ జమ కావని గుర్తించుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేపదే రైతులకు సూచించింది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఆగస్టు 31తో గడువు పూర్తి కానుంది. తర్వాత పెంచుతుందా ..? లేదా అనేవి షయం ఇంకా తెలియదు. ఒక వేళ ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోనట్లయితే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కాగా, ఇది వరకు ఈకేవైసీ చేసుకునేందుకు జూలై 31 గడువు ఉండేది. తర్వాత ఆ గడువును ఆగస్టు 31 వరకు పెంచింది. ఇప్పుడు ఈ గడువు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈకేవైసీ చేసుకోలేని రైతులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ఎలా..?
1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్ చేయాలి.
3. అందులో ఆధార్ నెంబర్, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.
4. ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
5. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేయాలి.
6. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇలా కాకుండా మీ దగ్గరలోని మీ సేవ కేంద్రంలోకి వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీకి ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. మరి గడువు పొడిగిస్తుందా..? లేదా అనేది చూడాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..