PM Kisan: రైతులకు శుభవార్త.. పదో విడతలో రూ.4000 పొందే అవకాశం.. పత్రాల సమర్పణకు ఈ రోజే ఆఖరు తేదీ..

|

Oct 31, 2021 | 3:02 PM

PM Kisan: రైతులకు శుభవార్త.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతలో రూ. 4000 లభిస్తాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర

PM Kisan: రైతులకు శుభవార్త.. పదో విడతలో రూ.4000 పొందే అవకాశం.. పత్రాల సమర్పణకు ఈ రోజే ఆఖరు తేదీ..
Pm Kisan
Follow us on

PM Kisan: రైతులకు శుభవార్త.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతలో రూ. 4000 లభిస్తాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీని ప్రయోజనాన్ని పొందడానికి మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ ప్రయోజనం కోసం అక్టోబర్ 31 లోపు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు రేషన్‌ కార్డుని తప్పనిసరి చేసింది. దీనితో పాటు భూమి పత్రాలు, ఇతర గుర్తింపుకార్డులు కూడా ఉండాలి.

కొత్త రిజిస్ట్రేషన్‌లో రైతులు తప్పనిసరిగా రేషన్ కార్డు నంబర్‌ను సమర్పించాలి. అదే సమయంలో పోర్టల్‌లో డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను (PDF ఫార్మాట్‌లో) అప్‌లోడ్ చేయాలి. అక్టోబరు 31లోపు రైతులు తమ పేర్లను నమోదు చేసుకుంటే వారికి రూ.4000.. అంటే వరుసగా రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు అందుతాయి. నవంబర్‌లో వారికి రూ. 2000 ఆ తర్వాత డిసెంబర్‌లో కూడా వారి బ్యాంక్ ఖాతాలో రూ. 2000 జమవుతాయి. అయితే 10వ విడత కింద 15 డిసెంబర్ 2021 నాటికి రైతుల బ్యాంకు ఖాతాలో రూ.2000 జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి..
1. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. ఇక్కడ మీరు కొత్త-రిజిస్ట్రేషన్ ఎంపికను పొందుతారు. దానిపై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. కొత్త పేజీలో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
5. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది
6. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో పూర్తి సమాచారం నింపాలి
7. మీ వ్యవసాయ సమాచారాన్ని అందించాలి.
8. తర్వాత మీరు దాన్ని సేవ్ చేయాలి.
9. అప్పుడు రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్‌ను సమర్పించాలి.

Gold Island: ఫలించిన ఐదేళ్ల అన్వేషణ.. మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువజేసే బంగారు ద్వీపం.. ఎక్కడంటే…

COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

Ileana D’Cruz: ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసిన ఇలియానా.. కారణమేంటంటే..