PM Kisan: రైతులకు అలెర్ట్.. ఈ పని పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోతాయి.. వివరాలివే!

|

Dec 12, 2022 | 2:08 PM

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులైన రైతులకు ముఖ్య అలెర్ట్. ఈ పని త్వరగా పూర్తి చేయకపోతే 13వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఆగిపోతాయి.

PM Kisan: రైతులకు అలెర్ట్.. ఈ పని పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోతాయి.. వివరాలివే!
లేదా.. PM కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ కూడా రైతుల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Follow us on

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులైన రైతులకు ముఖ్య అలెర్ట్. ఈ పని త్వరగా పూర్తి చేయకపోతే 13వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఆగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పధకానికి ఆధార్ ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. అందువల్ల ఇప్పటిదాకా ఈ పని పూర్తి చేయని రైతులు వెంటనే కంప్లీట్ చేయాల్సిందిగా కేంద్రం సూచిస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న రైతుల భవిష్యత్తును కాపాడేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే 2018వ సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్ స్కీం)ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి ఏటా కేంద్రం రైతుల ఖాతాల్లోకి 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ రూ.6 వేల మొత్తాన్ని మూడు విడతల రూపంలో రైతుల ఖాతాలోకి జమ చేస్తోంది. ఇప్పటి వరకు 12 విడతల సొమ్ము రైతుల ఖాతాలో జమ కాగా.. త్వరలోనే 13వ విడత నగదును కేంద్రం రిలీజ్ చేయనుంది.

ఇది కాకపోతే డబ్బులు రాకపోవచ్చు:

వచ్చే ఏడాది జనవరి నెలలో రైతుల ఖాతాల్లోకి 13వ విడత డబ్బును కేంద్రం బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, మీరు ఇప్పటి వరకు ఈ పథకంలో ఆధార్ e-KYC చేయకుంటే. వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లేదంటే 13వ విడత డబ్బు నిలిచిపోవచ్చు.

ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేయండి:

స్కీమ్‌లో నమోదు చేసుకునేటప్పుడు మీరు తప్పుడు సమాచారాన్ని నమోదు చేసి ఉంటే.. పథకం ప్రయోజనం పొందలేరు. అటువంటి పరిస్థితిలో, మీరు వీలైనంత త్వరగా పథకంలో మీకు సంబంధించి తప్పుడు వివరాలను సరిదిద్దుకోవాలి. అలాగే రేషన్ కార్డు కాపీని ఇప్పటిదాకా సమర్పించకపోతే.. వెంటనే సమర్పించాలి.