PM Kisan: రైతులకు అలర్ట్.. e-KYC అప్డేట్‏కు జూలై 31 చివరి తేదీ.. ఆన్‏లైన్.. ఆఫ్‏లైన్‏లో ఎలా అప్డేట్ చేయాలో తెలుసా..

|

Jul 02, 2022 | 10:51 AM

అన్నదాతలు e-KYC అప్డేట్ చేయడానికి జూలై 31 చివరి తేదీ అని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12 విడత నగదు పొందాలంటే

PM Kisan: రైతులకు అలర్ట్.. e-KYC అప్డేట్‏కు జూలై 31 చివరి తేదీ.. ఆన్‏లైన్.. ఆఫ్‏లైన్‏లో ఎలా అప్డేట్ చేయాలో తెలుసా..
Pm Kisan
Follow us on

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) ద్వారా దేశంలో అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఆర్థిక కల్పిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్ ద్వారా రైతులకు వ్యవసాయ..సంబంధిత సామాగ్రి కొనుగోలు ఖర్చులకు తగిన సహాయం చేస్తుంది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6000 అందిస్తుంది. ఇవి ఒకేసారి కాకుండా ఏడాదిలో 3 విడతల వారిగా ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2000 రైతులకు అందిస్తుంది. అయితే ఈ పథకం డబ్బులు రావాలంటే రైతులంతా పీఎం కిసాన్ e-KYC అప్డేట్ చేయాల్సి ఉంటుంది..

అన్నదాతలు e-KYC అప్డేట్ చేయడానికి జూలై 31 చివరి తేదీ అని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12 విడత నగదు పొందాలంటే e-KYC అప్డేట్ తప్పనిసరిగా చేసింది. నిర్ణిత సమయంలోపు e-KYC అప్డేట్ చేయకపోతే తదుపరి విడత నగదు రైతులకు రాదు. మరీ ఈ e-KYC అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందామా.

పీఎం కిసాన్ e-KYC అప్డేట్..
పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ నమోదిత రైతులకు e-KYC అప్డేట్ తప్పనిసరి. దీనిని ఓటీపీ ఆధారంగా కూడా పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదా బయోమెట్రిక్ ఆధారంగా కూడా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రాలల్లో అప్డేట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

e-KYC అప్డేట్ ఆన్ లైన్ లో ఎలా అప్డేట్ చేయాలి..
* ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి.
* ఆ తర్వాత మీరు కుడి వైపు ఉండే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* తర్వాత ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ స్టెప్ 4పై క్లిక్ చేయాలి.
* అనంతరం ఆధార్ కార్డుతో అనుసంధించబడిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి.
* చివరగా ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

e-KYC అప్డేట్ ఆఫ్ లైన్ లో ఎలా అప్డేట్ చేయాలి..
* ముందుగా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి.
* పీఎం కిసాన్ ఖాతా కోసం ఆధార్ అప్డేట్ సమర్పించాలి.
* పీఎం కిసాన్ ఖాతాకు లాగిన్ అయ్యేందుకు బయోమెట్రిక్‏లను నమోదు చేయాలి.
* ఆధార్ కార్డ్ నంబర్ అప్డేట్ చేసి.. ఫారమ్ సబ్మిట్ చేయాలి.
* ఆ తర్వాత మీ ఫోన్ కు నిర్ధారణగా ఎస్ఎంఎస్ వస్తుంది.