PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రానట్లే.. అదెంటో తెలుసా..

|

Feb 17, 2022 | 1:02 PM

PM Kisan Samman Nidhi Yojana: దేశ వ్యాప్తంగా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్క్రీమ్స్ ప్రవేశపెట్టింది.

PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రానట్లే.. అదెంటో తెలుసా..
Pm Kisan
Follow us on

PM Kisan Samman Nidhi Yojana: దేశ వ్యాప్తంగా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్క్రీమ్స్ ప్రవేశపెట్టింది. అందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించనున్నారు. సంవత్సరానికి రైతుల ఖాతాల్లో రూ. 6వేలు నేరుగా జమచేయనున్నారు. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. విడుదల వారిగా రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటివరకు పీఎం కిసాన్ నగదును పది విడుతలుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోకవడానికి అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ కావాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు 11వ విడత పొందడానికి రైతులు ఒక చిన్న పొరపాటు చేయకూడదు. అదెంటీ అనుకుంటున్నారా? అదెనండి.. eKYC అప్డేట్ చేయడం మర్చిపోవద్దు.. eKYC అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్డేట్ చేయడం మర్చిపోతే రైతులకు 11వ విడత నగదు అందదు. eKYC అప్డేట్ చేయడానికి కొన్ని స్టేప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

eKYCని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి..
– ముందుగా రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ కి లాగిన్ కావాలి.
– అందులోని హోమ్ పేజీలో eKYC ఎంపికపై క్లిక్ చేయాలి.
– దీంతో ఒక కొత్త పేజీ ఒపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ కార్డ్, నంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
– ఆ తర్వాత లబ్దిదారులు, ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
– తర్వాత గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి.
– ఇప్పుడు వ్యక్తి పేర్కొన్న ఫీల్డ్ లో ఓటీపీని ఎంటర్ చేయాలి.
– ఆ తర్వాత పీఎం కిసాన్ eKYC విజయవంతంగా అప్డేట్ అవుతుంది.
పీఎం కిసాన్ పథకం విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా.. అధికారిక వెబ్ సైట్ కి లాగిన్ కావాలి.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…