ప్రస్తుత రోజుల్లో భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడం చాలా ముఖ్యం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే పొదుపుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇరవై ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే పదవీ విరమణ ప్రణాళికను ప్రారంభించడం చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణుల వాదన. చాలా మంది ముప్పై, నలభై ఏళ్లు వచ్చాక పదవీ విరమణ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే పెరిగిన వయస్సు నేపథ్యంలో అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ సమయంలో పదవీ విరమణ ప్రణాళిక అటకెక్కుతుంది. కాబట్టి ఆర్థిక భవిష్యత్‌ను ప్లాన్ చేసుకోవడానికి మీ 20 ఏళ్ల వయస్సు చాలా కీలకంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ మొత్తంలో పొదుపు చేయవచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి ఆర్థిక నిపుణులు సూచించే ఆ ప్రణాళికలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
మీరు 20 ఏళ్ల నుంచే పదవీ విరమణ ప్రణాళికను ప్రారంభించడం అంటే ముందస్తుగా పొదుపును ప్రారంభిస్తున్నట్లే. సంపదను సృష్టించేటప్పుడు టైమ్ అనేది చాలా కీలకంగా మారుతుంది. మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే మీరు పెట్టుబడి డబ్బు చక్రవడ్డీ రూపంలో అధిక రాబడిని అందిస్తుంది. ఇది ముప్పై, నలభై ఏళ్లు వచ్చిన తర్వాత పెట్టే పెట్టుబడి కంటే ఎక్కువగా ఉంటుంది.
మీరు 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు స్పష్టమైన పదవీ విరమణ లక్ష్యాలను సెట్ చేసుకోవడానికి ఉత్తమ సమయమని నిపుణుల వాదన. ముఖ్యంగా ఈ వయస్సులో జీవనశైలి లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు . మీరు మీ పదవీ విరమణ తర్వాత హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా. లేదా రెండో ఉద్యోగాన్ని చేపట్టాలనుకుంటున్నారా? అనే అంశాలను ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డబ్బు ఆదా చేయడానికి, స్మార్ట్ పెట్టుబడులు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
మీరు ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు పదవీ విరమణ కోసం ప్లాన్ చేయడం ప్రారంభిస్తే మీకు కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఇది భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే మంచి ఖర్చు, పొదుపు అలవాట్లను సృష్టిస్తుంది. మీరు పొదుపులకు ప్రాధాన్యత ఇవ్వడం, తక్కువ ఖర్చుతో జీవించడం, బడ్జెట్‌ను క్రమశిక్షణగా పాటించడం వంటివి అలవాటు అవుతాయి. ఇలాంటి చర్యల కారణంగా పదవీ విరమణ పొదుపులతో పాటు ఇంటి యాజమాన్యం, రుణ చెల్లింపు వంటి ఇతర ఆర్థిక మైలురాళ్లను నిర్వహించడంలో ఈ రొటీన్‌లు మీకు సహాయపడతాయి.
పెట్టుబడి విషయానికి వస్తే మీ ఇరవై ఏళ్లల్లో మీకు పొదుపు కోసం ఎక్కువ సొమ్ము వెచ్చించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రిస్క్ సంబంధిత పథకాల్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందవచ్చు. షేర్ మార్కెట్ వంటి పథకాల్లో పెట్టుబడి పెడితే రిస్క్‌తో పాటు లాభం కూడా ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను ముందుగానే ప్రారంభించడం ద్వారా అధిక సంపదను పొందవచ్చు.
జీవితం అనూహ్యమైనది కాబట్టి ఏ వయసులోనైనా ఊహించని అడ్డంకులు రావచ్చు . మీరు మీ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే మీరు డబ్బు పరంగా ఆర్థిక భద్రత పొందవచ్చు. సొమ్ము బ్యాకప్‌గా ఉండడం వల్ల మీరు వైద్య ఖర్చులు, ఉద్యోగ నష్టం లేదా ఇతర ఊహించలేని సంఘటనలతో సంబంధం లేకుండా అధిక-వడ్డీ రుణాన్ని తీసుకోకుండా మీరు పొదపు చేసుకున్న సొమ్ము మీకు సహాయంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..