Buying Tips: టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకగా షాపింగ్ చేయండిలా..

పండుగ సీజన్ కావడంతో ఇంటిలో కొత్త వస్తువులను కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. అది శుభప్రదంగా పరిగణిస్తారు.

Buying Tips: టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకగా షాపింగ్ చేయండిలా..
Buying Tips

Updated on: Oct 25, 2022 | 4:08 PM

పండుగ సీజన్ కావడంతో ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. అది శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో ఎంతోమంది తమ ఇంటికి టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ లాంటి కొత్త ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. మరి అలాంటి షాపింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే.. మీ డబ్బును ఆదా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ఆఫర్లు:

ప్రస్తుతం చాలామంది వ్యక్తులు షాపింగ్ కోసం ఈ-కామర్స్ వెబ్‌సైట్లను సెర్చ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ-కామర్స్ సైట్లు మార్కెట్ ధర కంటే తక్కువ రేట్లకే అమ్ముతుంటాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్‌ల సాయంతో మీరు చౌకగా షాపింగ్ చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి బడా ఈ కామర్స్ వెబ్‌సైట్లు.. పండుగ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని మీరు ఆ ఆఫర్లు సద్వినియోగం చేసుకుని.. డబ్బులను ఆదా చేయొచ్చు.

రివార్డ్ పాయింట్లు:

మీ ఎలక్ట్రానిక్ వస్తువుల బిల్లును తగ్గించుకునేందుకు మీరు రివార్డ్ పాయింట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు క్రెడిట్, డెబిట్ కార్డులపై రివార్డ్ పాయింట్ల ప్రయోజనాన్ని అందిస్తాయి. వాటిని వినియోగించడంతో మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు.

క్యాష్‌బ్యాక్ ఆఫర్:

మీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అనేక బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రైవేట్ బ్యాంకులు పండుగల సందర్భంగా తమ కస్టమర్లకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా అందిస్తాయి.

రిటైల్ స్టోర్ ప్రత్యేక ఆఫర్లు:

పండుగ నాడు ప్రతీ రిటైల్ దుకాణం ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తాయి. ఏదైనా పెద్ద బ్రాండ్ షోరూమ్‌కు వెళ్తే.. మీరు ఆ ఆఫర్లు వినియోగించుకుని.. డబ్బును ఆదా చేసుకోవచ్చు.