New Pension Scheme: వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!

New Pension Scheme: ప్రభుత్వం మరో కొత్త పింఛను పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద పెన్షన్ ఫండ్‌లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి ఆప్షన్లను సులభంగా ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 'పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్..

New Pension Scheme: వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!
Pension Scheme

Updated on: May 09, 2026 | 12:52 PM

New Pension Scheme: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పింఛను పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జాతీయ పింఛను వ్యవస్థలో (NPS) భాగంగా ‘ఎన్‌పీఎస్ సంచయ్’ (NPS Sanchay) అనే స్కీమ్‌ను ప్రారంభించింది. మే 6, 2026 నుండి ఈ పథకం అమలులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Lizard in AC: ఏసీ లోపలికి బల్లి దూరిందా? అయితే జాగ్రత్త..వెంటనే ఇలా చేయండి.. లేదంటే భారీ నష్టం తప్పదు!

ఎవరు అర్హులు?

  • ఈ పథకం ప్రధానంగా అసంఘటిత రంగంలో పని చేసే వారి కోసం రూపొందించారు.
  • వయోపరిమితి: 18 ఏళ్ల నుండి 85 ఏళ్ల లోపు వయసున్న భారతీయ పౌరులందరూ ఇందులో చేరవచ్చు.
  • లబ్ధిదారులు: భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ వేతన జీవులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పెట్టుబడి, రూల్స్:

కనీస పెట్టుబడి: ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఎస్ తరహాలోనే ఇందులో నెలకు కనీసం రూ.1,000 నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
పెట్టుబడి విధానం: యూపీఎస్ (UPS), ఏపీవై (APY) వంటి ప్రభుత్వ పథకాల మార్గదర్శకాలకు అనుగుణంగానే దీని పెట్టుబడి విధానం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విత్ డ్రాయల్ (ఉపసంహరణ): సాధారణ ఎన్‌పీఎస్ నిబంధనలే ఇక్కడ కూడా వర్తిస్తాయి. పాక్షిక ఉపసంహరణ, పథకం నుండి వైదొలగడం వంటివి పాత నిబంధనల ప్రకారమే ఉంటాయి.

పెన్షన్ లెక్కలు ఎలా ఉంటాయి?

ఈ పథకంలో వచ్చే రాబడి మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటుంది (సుమారు 10% రాబడి అంచనా వేయవచ్చు). పథకం గడువు ముగిసిన తర్వాత ఏర్పడిన మొత్తం (Corpus) నుండి 40 శాతం తప్పనిసరిగా ‘యాన్యుటీ’ (Annuity) కొనుగోలుకు ఉపయోగించాలి. దీని ద్వారానే మీకు నెల నెలా పెన్షన్ వస్తుంది.

ఉదాహరణకు: 20 ఏళ్ల వయసులో నెలకు రూ. 5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ సమయానికి రూ. 3.1 కోట్ల నిధి జమ అవుతుంది. అందులో 40 శాతం యాన్యుటీ కొంటే, నెలకు సుమారు రూ. 1,27,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. (గమనిక: పెట్టుబడి కాలం, రాబడిని బట్టి ఈ మొత్తాలు మారుతుంటాయి).

ముఖ్య ఫీచర్లు:

మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద పెన్షన్ ఫండ్‌లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి ఆప్షన్లను సులభంగా ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ‘పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ (PoP) సేవల ద్వారా దీనికి సంబంధించిన ఛార్జీలు వర్తిస్తాయి.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్ గంటకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తెలుసా? ఒకసారి బట్టలు ఉతికితే అయ్యే ఖర్చు ఇదిగో!

ఇది కూడా చదవండి:Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us