
Petrol, Diesel: ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వారంలోనే నాలుగు సార్లు ధరలు పెంచడం వాహనదారులకు ఇబ్బందిగా మారిపోయింది. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయనే భయం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణను 60 రోజుల పాటు పొడిగించేందుకు తాత్కాలిక ఒప్పందం కుదిరిన తర్వాత చమురు ధరలు తగ్గడం ఊరట కలిగించే విషయం. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $93కు పడిపోయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర సుమారు $88 వద్ద ట్రేడ్ అవుతోంది.
పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ (ATF) విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మే 30 శనివారం నాడు ప్రభుత్వం జారీ చేసిన ఒక ప్రకటనలో జూన్ 1 నుండి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని తగ్గించనున్నట్లు తెలిపింది. పెట్రోల్ ఎగుమతిపై లీటరుకు రూ.1.5, డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ.13.50 తగ్గించారు. అదే సమయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతిపై పన్నును లీటరుకు రూ.9.5 తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల దేశీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే దేశీయ స్థాయిలో పన్నులో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గిన తరుణంలో ఎగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Indian Railways: స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఈ ప్రత్యేక రైల్వే సౌకర్యం గురించి మీకు తెలుసా?
ప్రభుత్వం 2026 మార్చి 27న ఈ ప్రత్యేక పన్నును ప్రవేశపెట్టింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ లభ్యతను కొనసాగించడానికి ప్రభుత్వం ఈ పన్నును విధించింది. ధరలను చివరిసారిగా మే 16న సవరించారు. ఆదివారం చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పులు చేయలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. చమురు కంపెనీలు దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను చివరిసారిగా సోమవారం పెంచాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.95.20గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69కి చేరుకోగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.103కి చేరింది.
ఇది కూడా చదవండి: RBI: పెద్ద నోట్ల రద్దు తర్వాత 10 ఏళ్లకు ఆర్బీఐ మరో కీలక మార్పుకు సన్నాహాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి