Petrol Price Today: పెట్రో పరుగులకు స్మాల్ బ్రేక్.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోలు, డీజీల్ ధరలు ఇలా ఉన్నాయి..

|

Mar 07, 2021 | 10:58 AM

Petrol Price: వాహనాలను పెట్రోల్‌ బంక్‌కి తీసుకెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి.

Petrol Price Today: పెట్రో పరుగులకు స్మాల్ బ్రేక్.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోలు, డీజీల్ ధరలు ఇలా ఉన్నాయి..
Petrol Price Today
Follow us on

Petrol Price Today: పెట్రో ప్రైస్ బొమ్మ దద్దరిల్లిపోతుంది. సగటు జీవికి చుక్కలు చూపిస్తోంది. ట్యాంక్‌లో ఆయిల్ పోయించుకునేందుకు చెమట చుక్కలు ధారపోయాల్సి వస్తోంది. ఇంతకీ పెట్రో ధరలు రన్ రాజా రన్ అంటూ ఎందుకు పరుగెడుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా..? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఓ లుక్కేయండి.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (శనివారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద ( శనివారం రూ.రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (శనివారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (శనివారం రూ.88.60 ) గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (శనివారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (శనివారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (శనివారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (శనివారం రూ. 88.45 )గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.73 (శనివారం రూ.97.31 ), డీజిల్‌ ధర రూ. 91.23 (శనివారం రూ.90.81) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.13 (శనివారం రూ. 96.79 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 89.69 (శనివారం రూ.90.30 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా ( శనివారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.45 (శనివారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (శనివారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (శనివారం రూ. 86.37 ) గా ఉంది.

ఇవి కూడా చదవండి

Araku Bus Accident: అరకు బస్‌ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..

Banana : అరటిపండుతో పొట్ట పెరుగుతుందా.. తగ్గుతుందా.. ? పరిశోధకులు తేల్చిన వాస్తవాలు ఏంటో మీకు తెలుసా..