
Petrol Price in India (31st January 2021) : ఓ వైపు దేశంలోని ప్రజలు కరోనా కష్టాలతో ఇబ్బందులుపడుతుంటే.. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ కొట్టడంతో అల్లాడుతున్నారు. వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి సవరణలు చేయలేదు. దేశ వ్యాప్తంగా శనివారం రోజున ఉన్న ధరలే ఆదివారం కూడా ఉన్నాయి. డిల్లీలో ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు రూ .86.30 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .76.48. ముంబైలో పెట్రోల్‌ను రూ .92.86, డీజిల్‌ను లీటరుకు రూ .83.30 కు విక్రయిస్తున్నారు.
ఇక కోల్‌కతా లో కూడా పెట్రోల్ రూ .87.69 వద్ద, డీజిల్ లీటరుకు రూ .80.08 వద్ద లభిస్తుంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ .88.82, డీజిల్ లీటరుకు రూ .81.71 లకు విక్రయిస్తున్నారు. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్‌ను రూ .89.21, డీజిల్‌ను లీటరుకు రూ .81.10 కు విక్రయిస్తున్నారు.
కరోనా సమయంలో ఆర్ధిక కష్టాల్లో ఉన్నా కొన్ని రాష్ట్రాల్లో రూ.90 నుంచి 100 వరకూ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో
పెట్రోలియం, సహజవాయువు శాఖ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని ఇందులో సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో భారత్‌లో అదనపు సుంకాలు విధించారు. ఇప్పుడు వాటిని తగ్గించమని ఇంధన శాఖ కోరింది.పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విదేశీ మారకపు రేటుతో పాటు ఉంటాయి.
Also Read: భారత్ లో నిలకడగా సాగుతున్న కొత్త కరోనా కేసుల నమోదు.. గత 24గంటల్లో 13,965 పాజిటివ్ కేసులు