Petrol, Diesel rates Today: ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలు, డీజిల్(Petrol, Diesel) ధరలు ఫిబ్రవరి 7న 94వ రోజు కూడా మారలేదు. ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 4, 2021న ఎక్సైజ్ సుంకాన్ని(excise duty) తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.51 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.91.53గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 కు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.52గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.83ఉండగా.. డీజిల్ ధర రూ.94. 28గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.34గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.85కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.90 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.36లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.13గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.23గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.85లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.90లకు లభిస్తోంది.
Read Also.. Multibagger stocks: భారీ రాబడిని ఇచ్చిన స్మాల్‌క్యాప్ స్టాక్స్.. ఆ ఐదు కంపెనీలు ఏమిటంటే..