Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంతంటే..

|

May 01, 2022 | 9:17 AM

Petrol-Diesel Price: పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటం వాహనదారులకు తీవ్రమైన భారంగా ..

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంతంటే..
Follow us on

Petrol-Diesel Price: పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటం వాహనదారులకు తీవ్రమైన భారంగా మారింది. అయితే రాకెట్‌లా దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. వాహనదారులకు గత కొద్ది రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊరట కల్పిస్తున్నాయి. చమురు కంపెనీలు చివరిసారిగా ఏప్రిల్‌ 6వ తేదీన లీటర్‌కు 80 పైసల చొప్పున పెంచగా, ఇక తాజాగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (IOC)లు ఆదివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విడుదల చేశాయి. వరుసగా 26వ రోజు కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేదు . అయితే, శుక్రవారం పూణె, ముంబైలలో సిఎన్‌జి గ్యాస్ ధర పెరిగింది. సిఎన్‌జి ధరలను కిలోకు రూ.4 పెంచుతున్నట్లు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఎంజిఎల్ శుక్రవారం ప్రకటించింది.

ఇక తాజాగా మే 1వ తేదీన హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గా, లీటరు డీజిల్ ధర రూ.105.49 పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రంలోని విశాఖపట్నంలో ధరలలో మార్పు చోటు చేసుకుంది. లీటరు పెట్రోల్ ధర రూ.120 నుంచి రూ.120.87కు పెరిగింది. అలాగే లీటరు డీజిల్ ధర రూ.105.65 నుంచి రూ.106.46కు ఎగిసింది. ఏపీలో చాలా ప్రాంతాలలో ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 96.67గా ఉంది. ఇక ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 120.51 ఉండగా, డీజిల్‌ ధర రూ. 104.77 ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.99.83గా నమోదవుతోంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.85 ఉండగా, డీజిల్‌ ధర రూ.100.94 వద్ద ఉంది. . మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి:

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 27 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో దేశ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పెట్రోల్ మరియు డీజిల్‌పై విధించే పన్నును తగ్గించాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చమురుపై పన్ను తగ్గించాలని కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source:

ఇవి కూడా చదవండి:

SSY Account Transfer: సుకన్య సమృద్ధి ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం ఎలా?

LPG Gas Cylinder Price: వినియోగదారులకు షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..!