Petrol, Diesel Prices today: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా నిత్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు నానా తంటలు పడుతున్నారు. ఈ నెలలోనే చమురు ధరలు 15 సార్లు పెరిగాయి. అయితే మూడు రోజులుగా స్థిరంగా సాగుతున్న ధరలు మరోసారి శనివారం పెరగడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. దేశంలో తాజాగా దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25పైసలు వరకు పెంచాయి. కాగా కేవలం ఈ నెలలోనే చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి.
తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు చొప్పున ధర పెరిగింది.
దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 కు చేరగా, డీజిల్ ధర రూ.81.47 గా నమోదైంది.
ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.57, డీజిల్ రూ.88.70కి చేరుకుంది.
బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.94.22కి పెరగగా.. డీజిల్ రూ.86.37కి చేరింది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ.91.11కి ఉండగా.. డీజిల్ రూ.86.45కి చేరింది.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.35కి చేరగా… డీజిల్ 15 పైసలు పెరిగి లీటర్ రూ.84.35కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో..
కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రో ధరలు మండుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్‌పై 17పైసలు ధర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.94.79 కు చేరగా.. డీజిల్ ధర రూ.88.86గా నమోదైంది.
విజయవాడలో పెట్రోల్ లీటర్ 97.00కి చేరగా… డీజిల్ ధర రూ.90.55కి పెరిగింది.
అయితే గడిచిన 30 రోజుల్లో దాదాపు పెట్రోల్ ధర రూ.5 పెరగింది. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గత 58రోజుల్లో చమురు కంపెనీలు.. పెట్రో ధరలను దాదాపు 26సార్లు పెంచాయి. ఈ క్రమంలోనే పెంచిన ధరలను తగ్గించాలంటూ నిన్న దాదాపు 40వేల సంఘాలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కూడా నిర్వహించాయి.
Also Read: