Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!

|

Oct 26, 2021 | 8:40 AM

గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక తాజాగా  కాస్త ఊరటనిచ్చాయి. ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు...

Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!
Petrol Diesel Prices
Follow us on

గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక తాజాగా  కాస్త ఊరటనిచ్చాయి. ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగానే ఉండటంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.32గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర దూసుకుపోతోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.113.46గా ఉండగా, డీజిల్ ధర రూ.104.38గా ఉంది. అలాగే చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.52 ఉండగా, డీజిల్ ధర రూ.100.59గా ఉంది. కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.11గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.99.43గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.91 ఉండగా, రూ.105.08గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.112.42 ఉండగా, డీజిల్ ధర రూ.104.62కు చేరుకుంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.112.21 ఉండగా, డీజిల్ ధర రూ.105.35కు చేరుకుంది.

విజయవాడలో పెట్రోల్ ధర రూ.113.93గా ఉండగా, డీజిల్‌ ధర రూ.106.50కి చేరింది. విశాఖపట్నం లీటర్‌ పెట్రోల్ ధర రూ.113.23గా ఉండగా, డీజిల్ ధర రూ.105.80గా ఉంది.

Read Also.. JioPhone Next: ఎప్పుడెప్పుడా అని చూస్తున్న జియోఫోన్ నెక్స్ట్ వచ్చేస్తోంది.. వీడియో