Petrol Diesel Price Today: వరుస పెరుగుదలతో హడలెత్తించిన చమురు ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉంటున్నాయి. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర లీటర్‌కు రూ.96.67గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, డీజిల్ ధర రూ. 104.77. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12, డీజిల్ ధర లీటరుకు రూ. 99.83. అదే సమయంలో చెన్నైలో పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర లీటరుకు రూ.100.94గా ఉంది.
మరోవైపు, రష్యా నుండి చమురు కొనుగోలును తగ్గించాలని గ్లోబల్ ట్రేడింగ్ హౌస్‌లు నిర్ణయించాయి. యూరోపియన్ యూనియన్ కూడా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై నిషేధం విధిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల కారణంగా, భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతి బిల్లులు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్‌లో భారత్ రోజుకు 48 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇందులో రష్యా నుంచి 5 శాతం దిగుమతి చేసుకుంది.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వరసగా….
ఢిల్లీ – 105.41 , 96.67
ముంబై – 120.51, 104.77
చెన్నై – 110.85, 100.94
కోల్‌కతా – 115.12, 99.83
లక్నో – 105.25, 96.83
జైపూర్ – 118.03, 100.92
పాట్నా – 116.23, 101.06
జమ్మూ – 106.52, 90.26
రాంచీ – 108.71, 102.02
పెట్రోల్ పై పన్నులు..
పెట్రోల్ పై పన్నుల విషయానికి వస్తే.. ఢిల్లీలో మే 1 నాటికి, పెట్రోల్ బేస్ ధర రూ.56.33. లీటరుకు రవాణా ఖర్చు రూ.0.20 గా ఉంది. ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.27.90, వ్యాట్ రూ.17.13. ఇందులో లీటరుకు డీలర్ కమీషన్ రూ.3.85. మొత్తంగా లీటర్ పెట్రోల్ రూ. 105.41గా ఉంది.
డీజిల్‌పై పన్ను..
డీజిల్ విషయానికి వస్తే లీటరు బేస్ ధర రూ.57.94. రవాణా ఖర్చు లీటరుకు రూ.0.22. ఎక్సైడ్ డ్యూటీ రూ.21.80, వ్యాట్ రూ.14.12. డీలర్ కమీషన్ లీటరుకు రూ.2.59. మొత్తంగా రూ.96.67 ధర ఉంది.
కాగా, చివరిసారిగా ఏప్రిల్ 6వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 6న రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 – 80 పైసలు పెరిగాయి. అంతకుముందు, నవంబర్ 4, 2021 నుండి మార్చి 21, 2022 వరకు దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయి. మార్చి 22 నుంచి చమురు ధరలు వరుసగా పెరిగాయి.