AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: ఈ 5 ఉచిత యాప్‌లు ఫోన్‌లో ఉంటే మీ సమయం ఆదా.. ఒకే క్లిక్‌తో అన్నీ సర్వీసులు

కేంద్ర ప్రభుత్వ సేవలు సులువుగా పేపర్‌లెస్ విధానంలో పొందేందుకు ఐదు యాప్‌లు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా మీరు ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా ఏ పనైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ యాప్‌లు దేశంలోని ప్రజలందరికీ ఉపయోగపతాయి. వీటిని ఒక్కసారైనా వాడి ఉంటారు.

Central Government: ఈ 5 ఉచిత యాప్‌లు ఫోన్‌లో ఉంటే మీ సమయం ఆదా.. ఒకే క్లిక్‌తో అన్నీ సర్వీసులు
Central Government Free App
Venkatrao Lella
|

Updated on: Feb 12, 2026 | 5:14 PM

Share

ఇండియాలో దాదాపు 145 కోట్ల మంది జనం ఉన్నారు. ఒకేసారి అందరికీ సేవలు అందించాలంటే కష్టతరమైన ప్రక్రియ. దీంతో ప్రజలకు వేగవంతమైన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక యాప్‌లను తీసుకొస్తుంది. వీటి వల్ల ప్రజలు క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా మొబైల్ నుంచే ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చు. పేపర్‌లెస్ విధానంలో డిజిటల్‌గా అవసరమైన సేవలను యాక్సెస్ చేయడానికి ఈ యాప్‌లు ఉపయోగపడతాయి. కొత్త ఆధార్ యాప్‌, డిజిలాకర్ నుంచి డిజియాత్ర వరకు దేశంలోని ప్రజలకు ఉపయోగపడే ఐదు ఉచిత యాప్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉమాంగ్

యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నెన్స్(ఉమాంగ్) అనేది కేంద్ర ప్రభుత్వ యాప్. ఇందులో అనేక కేంద్ర ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఆరోగ్యం, విద్య, యుటిలిటీ, ఉపాధి, ఇతర సేవలను పొందటానికి ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా సమయాన్ని ఈ యాప్ ఆదా చేస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ యాప్ ద్వారా డిజిటల్ గవర్నెన్స్ పొందవచ్చు.

ఆధార్ యాప్

ఆధార్ పేరుతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఆధార్‌కు సంబంధించిన అన్నీ ఆన్‌లైన్ సేవలు ఈజీగా పొందవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ సమాచారం, గుర్తింపు ధృవీకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇక మొబైల్, అడ్రస్ అప్డేట్, కుటుంబసభ్యుల ఆధార్ వివరాలు ఒకేచోట ఉంచుకోవడం, బయోమెట్రిక్ లాక్ లేదా అన్ లాక్ చేసుకోవడం వంటి సౌకర్యాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

డిజిలాకర్

ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపర్చుకునేందుకు, యాక్సెస్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. సర్టిఫికేట్లు,గుర్తింపు ధృవీకరణ పత్రాలు, అధికారిక రికార్డులను డిజిటల్ రూపంలో ఇందులో ఉంచుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమంట్ల అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. ఇక ఫైల్స్‌ను సులభంగా, సురక్షితంగా పంచుకునేందుకు ఇది సహాయపడుతుంది. కాగిత రహిత వెరిఫికేషన్ ప్రక్రియకు ఇది ఉయోగపడుతుంది.

డిజియాత్ర

డిజియాత్ర అనేది ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణాలను వేగవంతం చేయడానికి ముఖ గుర్తింపుకు ఉపయోగపడే యాప్. ప్రయాణికులు డిజియాత్ర ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లను చూపించకుండానే బోర్డింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. క్యూలను తగ్గించడంతో పాటు సమయం ఆదా అవుతుంది. అలాగే భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. సౌకర్యవంతమైన విమాన ప్రయాణం కోసం ప్రయాణికుల డేటా సురక్షితంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఈ ఐదు యాప్‌లను ఉచితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి ఉపయోగించుకోవచ్చు. సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా ఇంటర్‌ఫేస్ సింపుల్‌గా ఉంటుంది.