Petrol-Diesel Price Today: గత కొన్ని రోజులుగా దేశీయంగా పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా రేట్లు పెరగకపోయినా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారింది. లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటిపోవడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇక వరుసగా 31 వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశీయంగా ధరలు ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..? అనే విషయమై సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్ సుంకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 ఉండగా, డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.98.22గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.22 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.77గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.89 ఉండగా,. డీజిల్ ధర రూ. 98.51గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.99.48గా ఉంది.