Petrol, Diesel Prices: సామాన్యుడికి ఇంధన సెగ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు

Petrol, Diesel Prices: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును RBI 6.9 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని, అవసరమైతే కఠిన చర్యలు చేపట్టడానికి..

Petrol, Diesel Prices: సామాన్యుడికి ఇంధన సెగ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Petrol, Diesel Prices

Updated on: May 13, 2026 | 3:07 PM

Petrol, Diesel Prices: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ యుద్ధ వాతావరణం మరికొంత కాలం కొనసాగితే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు.

ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ భారాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలే భరిస్తున్నాయి. అయితే ఈ భారాన్ని ఎక్కువ కాలం మోయడం సాధ్యం కాదని గవర్నర్ స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని, కంపెనీలు కూడా నష్టాలను ఓర్చుకుంటూ వినియోగదారులపై భారం పడకుండా చూస్తున్నాయని తెలిపారు. కానీ ఉద్రిక్తతలు తగ్గకపోతే ధరల పెరుగుదల తప్పదని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ పిలుపు: పొదుపు మంత్రం

మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు, బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని సూచించారు. తద్వారా దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం రెట్టింపు చేసింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం

భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నాటికి 3.48 శాతానికి చేరుకుంది. మార్చిలో ఇది 3.40 శాతంగా ఉండటం గమనార్హం. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడం, రవాణా ఖర్చులు పెరగడం వంటివి రానున్న నెలల్లో భారతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితిని పర్యవేక్షిస్తున్న RBI

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును RBI 6.9 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని, అవసరమైతే కఠిన చర్యలు చేపట్టడానికి వెనకాడబోమని గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్‌..!

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us