Petrol And Diesel Rates Today: దేశంలో ఇటీవల కాలంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నియంత్రణ లేకుండా పోయింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.100కు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే.. భయపడే పరిస్థితులు ఏర్పాడ్డాయి. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలో సామాన్యులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతోపాటు దేశ్యప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత గళం సైతం వినిపించింది. పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళనలు సైతం చేశాయి. ఈ క్రమంలో పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు గతకొన్ని రోజులగా బ్రేక్ పడుతూ వస్తోంది. కారణాలు ఏమైనా.. గడిచిన కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. దీంతోపాటు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దేశంలోని కొన్ని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* హైదరాబాద్‌లో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.94.16 ఉండగా, డీజిల్ ధర రూ.88.20 ఉంది.
* వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్ ధర రూ.87.80 ఉంది.
* కరీంనగర్‌లో పెట్రోల్ ధరలో కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.94.29 ఉండగా, డీజిల్ ధర రూ.88.31గా ఉంది.
* ఆంధ్రప్రదేశ్ విజయవాడలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.88 ఉండగా, డీజిల్ ధర రూ.90.38 గా ఉంది.
* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.07గా ఉండగా, డీజిల్ ధర రూ.90.38గా ఉంది.
* విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.66గా ఉండగా, డీజిల్ ధర రూ.90.12గా ఉంది.
* దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56 ఉండగా, డీజిల్ ధర రూ.80.87గా ఉంది.
* కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.77 ఉండగా, డీజిల్ ధర రూ.83.75 ఉంది.
* ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.98 ఉండగా, డీజిల్ ధర రూ.87.96 ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58 ఉండగా, డీజిల్ ధర రూ.85.88 ఉంది.
* కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.93.59 ఉండగా, డీజిల్ ధర రూ.85.75 ఉంది.
Also Read: