Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!

నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రచార సందడి మొదలైంది. ఈ ప్రభావం పెట్రో ధరలపై పడింది. దీంతో..

Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!
Petrol Price Today

Updated on: Mar 31, 2021 | 7:25 AM

Petrol And Diesel Rates: దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగుతుంటే పెట్రో ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రచార సందడి మొదలైంది. ఈ ప్రభావం పెట్రో ధరలపై పడింది. దీంతో పెట్రోల్, డీజిల్‌ ఈ రోజు దేశ వ్యాప్తంగా స్పల్ప మార్పులు కనిపించాయి.

పెట్రో ధరలు…

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.56 (మంగళవారం 90.78) ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.87(మంగళవారం 81.10) వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.98గా(మంగళవారం 97.19) ఉండగా డీజిల్‌ రూ. 87.96గా (మంగళవారం 88.26)ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ ధర 93.59 (మగళవారం 93.82)గాఉండగా.. డీజిల్ ధర 85.75(మంగళవారం 85.95) ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 85.88 (మంగళవారం 86.10)గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.16(మంగళవారం 94.39)గా ఉండగా.. డీజిల్‌ రూ. 88.20 (మంగళవారం 88.45)వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో స్వల్ప మార్పు కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.92(మంగళవారం 94.51)గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 87.97 (మంగళవారం 88.56)గా నమోదైంది. విజయవాడలో ధరల్లో కొద్దిగా పెరిగాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.67 (మంగళవారం రూ.97.43) కాగా డీజిల్‌ ధర రూ. 90.16గా(మంగళవారం 90.92) నమోదైంది… సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 95.66 (మంగళవారం రూ.96.09) గా  డీజిల్‌ ధర రూ. 89.19(మంగళవారం 89.62)గా నమోదైంది.

ఇవి కూడా చదవండి : AP CORONAVIRUS: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 9 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

Shriya Saran: పెళ్లినాటి వీడియో షేర్‌ చేసిన శ్రియా.. రంగుల్లో మునిగితేలుతూ భర్తతో రొమాంటిక్‌ డ్యాన్స్‌.. Viral Video