Petrol Price: వాహన దారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌ ధరలు.. 5 రోజుల్లో 4 సార్లు.. రూ. 110 దాటేసిన లీటర్‌ ధర..

|

Mar 26, 2022 | 8:25 AM

Petrol Price Today: దేశంలో ఇంధన ధరలు (Fuel Prices) భగ్గుమంటున్నాయి. శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు శాంతించిన ఇంధన ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. 5 రోజుల్లో ఏకంగా 4సార్లు..

Petrol Price: వాహన దారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌ ధరలు.. 5 రోజుల్లో 4 సార్లు.. రూ. 110 దాటేసిన లీటర్‌ ధర..
Petrol Diesel Prices
Follow us on

Petrol Price Today: దేశంలో ఇంధన ధరలు (Fuel Prices) భగ్గుమంటున్నాయి. శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు శాంతించిన ఇంధన ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. 5 రోజుల్లో ఏకంగా 4సార్లు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. 4 విడతల్లో సుమారు రూ. 3.20 పెరగడం గమనార్హం. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ రూ. 110 దాటేసింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇంధన పెరిగాయి. శనివారం దేశంలో నమోదైన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఓ లుక్కేయండి..

దేశంలోని ప్రధాన నగరాల్లో..

* న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 98.61గా ఉండగా, డీజిల్‌ రూ. 89.87 కి ఎగబాకింది.

* ముంబయిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 113.35 వద్ద ఉండగా, డీజిల్‌ రూ. 97.55 గా నమోదైంది.

* చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.43 కాగా, డీజిల్‌ రూ. 94.47 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 111.80కి చేరగా, డీజిల్‌ రూ. 98.10కి పెరిగింది.

* విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ 113.62 కాగా, డీజిల్‌ రూ. 99.56కి చేరింది.

* గుంటూరులో లీటర్ పెట్రోల్‌ 113.83 కాగా, డీజిల్‌ రూ. 99.76 వద్ద కొనసాగుతోంది.

Also Read: Job Mela: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నేడు జాబ్‌ మేళా.. 250కిపైగా ఖాళీలు..

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత