Petrol Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలకు (Fuel Price) కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు 110 డాలర్లు దాటడం, ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం (Russian Ukraine War) కారణం ఏదైనా.. పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా గడిచిన నాలుగు రోజులుగా ఇంధన ధరలకు ఉపశమనం లభించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49 గా ఉండగా, డీజిల్ రూ. 105.49 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 121.63 (శనివారం రూ. 121.23), డీజిల్ రూ. 107.48 వద్ద కొనసాగుతోంది.
* గుంటూరులోనూ పెట్రోల్ ధర పెరిగింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 122.08 ( శనివారం రూ. 121.28), డీజిల్ ధర రూ. 107.63గా ఉంది.
* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.59కాగా, డీజిల్ రూ. 106.19 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.41 కాగా, డీజిల్ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 120.51 గా ఉండగా, డీజిల్ రూ. 104.77 గా నమోదైంది.
* చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.85 కాగా, డీజిల్ రూ. 100.94 గా ఉంది.
* బెంగళూరులో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 111.09 , డీజిల్ రూ. 94.79 వద్ద కొనసాగుతోంది.
Also Read: Chevireddy: చెవిరెడ్డికి కేబినెట్‌లో ఛాన్స్ లేనట్టే.. ఆయన ఆశించిన పదవి కట్టబెట్టిన సీఎం వైఎస్ జగన్
Health Benefits: నేలపై పడుకుంటే ఇన్ని ప్రయోజనాలా?.. నిపుణులు తెలిపిన కీలక వివరాలు మీకోసం..!