త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO బేసిక్ శాలరీ లిమిట్ పెంపు.. ఎవరికి లాభం..?
త్వరలో ఈపీఎఫ్‌వో మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈపీఎఫ్‌లో బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.25 వేలకు పెంచేందుకు రెడీ అవుతోంది. అసలు బేసిక్ శాలరీ లిమిట్ పెంచడం వల్ల ఎవరికి లాభం..? దీని వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది..?

EPFO విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈపీఎఫ్‌లో బేసిక్ శాలరీ లిమిట్ ఇప్పుడు రూ.15 వేలు ఉండగా. దీనిని రూ.25 వేలకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుంది. కార్మిక సంఘాలు కూడా బేసిక్ శాలరీ లిమిట్‌ను పెంచాలని ఎప్పటినుంచో కోరుతున్నాయి. ఈ పరిమితిని పెంచితే కోటి మందికిపైగా ఉద్యోగులు EPF, EPS కవరేజీలోకి వస్తారు. బేసిక్ శాలరీ లిమిట్ పెరిగితే లాభమా..? నష్టమా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
EPFలో ఉద్యోగి జీతంలో 12 శాతం EPFకి వెళ్తుంది. ఎంప్లాయర్ దీనికి 12 శాతం కలుపుతారు. అందులో 8.33 శాతం EPSకి పోతుండగా.. 3.67 శాతం EPFకి వెళుతుంది. ఒకవేళ బేసిక్ శాలరీ లిమిట్ పెరిగితే ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల జీవితాంతం పెన్షన్, ఈపీఎఫ్‌పై ఎక్కువ వడ్డీ, ఎంప్లాయర్ చెల్లింపు వంటివి పెరుగుతున్నాయి. దీని వల్ల ఎక్కువమంది పెన్షన్ పరిధిలోకి రావడంతో పాటు వృద్యాపంలో ఆర్ధిక భద్రత చేకూరుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇది అమల్లోకి తీసుకొస్తే.. 15 వేలు దాటి రూ.25వేలోపు సంపాదిస్తున్నవారు కూడా EPF, EPS పరిధిలోకి వస్తారు. దీని వల్ల ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పటివరకు రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ వేతంన తీసుకుంటున్నవారికి ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో చేరాలనే బలవంతం లేదు. దీంతో ఉద్యోగులు ఎప్పుడైనా వీటి నుంచి తప్పుకోవచ్చు. నగరాల్లో తక్కువ లేదా మిడ్ స్థాయి ఉద్యోగులు ఎక్కువ. దీంతో లిమిట్ పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
