Bank Cheques: బ్యాంక్ చెక్కు వెనుక సంతకం ఎందుకు చేస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..
డిజిటల్ ట్రాన్సక్షన్లు పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా చాలామంది బ్యాంక్ చెక్ బుక్స్‌ను ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు వినియోగిస్తున్నారు. చెక్కుల వెనుక సంతకం చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి..? ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఏం చెబుతున్నాయి.. ఇప్పుడు చూద్దాం

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఎన్ని లక్షలు, కోట్లు అయినా సరే ఆన్‌లైన్‌లో సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసే వెసులుబాటు లభించింది. యూపీఏ యాప్స్ రాకతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు మరింతగా పెరిగిపోయాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినా.. కొంతమంది పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయడానికి బ్యాంక్ చెక్ బుక్‌లను ఉపయోగిస్తున్నారు. బ్యాంకుకు లేదా మరొక వ్యక్తికి చెక్కు అందించేటప్పుడు దాని వెనుక సంతకం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. చెక్కులు ఎన్ని రకాలు..? వెనుకాల సంతకం ఎందుకు ఇలా చేస్తారు..? దీని వెనుక ఉద్దేశం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
బేరర్ చెక్కు
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బేరర్ చెక్కుల వెనుక భాగంలో సంతకం తప్పనిసరిగా చేయాలనే నిబంధన ఉంది. ఈ చెక్కుకు ఒక ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే.. బేరర్ చెక్కుపై పేరున్న వ్యక్తి మాత్రమే కాకుండా చెక్కు హోల్డర్ కూడా డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో బేరర్ చెక్కును వేరొకరి పేరు మీద డిపాజిట్ చేస్తే.. బ్యాంక్ వెరిపికేషన్ కోసం డిపాజిటర్ సంతకాన్ని కూడా కోరుతుంది. ఇలా సంతకం చేయడం ద్వారా చెక్కు సరైన వ్యక్తికి అందిందని బ్యాంక్ నిర్ధారించుకుంది. ఒకవేళ చెక్కు పోయినా లేదా దొంగలించబడినా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ ప్రక్రియ సహాయపడుతుంది. అందుకే బేరర్ చెక్కు వెనుకాల సంతకం చేయాలని ఆర్‌బీఐ నిబంధన విధించింది
అకౌంట్ పేయీ
ఇక అకౌంట్ పేయీ చెక్కుల విషయానికొస్తే.. ఇది చాలా సురక్షితం. ఈ ప్రక్రియ ద్వారా నిధులు నేరుగా ఉద్దేశించిన అకౌంట్లో జమ అవుతాయి. ఈ పద్దతిలో చెక్కు వెనుకాల సంతకం అవసరం లేదు. కానీ కొంతమంది అలవాటుగా చేస్తూ ఉంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
