
FD interest rates: డిజిటల్ కాలంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. యూపీఐ, NFBC, బ్యాంక్ యాప్స్ రాకతో ఫోన్ నుంచే డబ్బులు పొదుపు చేసుకునే వెసులుబాటు లభించింది. ఆర్‌బీఐ అనుమతితో నడుస్తున్న లోన్స్ యాప్స్ కూడా ఫిక్స్ డ్ డిపాజిట్, టర్న్మ్ డిపాజిట్ వంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి యాప్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు డిపాజిట్లపై బ్యాంకులను మించి అత్యధిక వడ్డీ ఇస్తున్నాయి. వీటికి పోటీగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు కల్పిస్తోంది. రెగ్యూలర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.95 శాతం అందిస్తుండగా.. సీనియర్ల సిటీజన్లకు 6.95 శాతం అందిస్తుంది. ఇక 18 నుంచి 21 నెలల కాలపరిమితి ఉంటే అత్యధిక వడ్డీని ఇస్తోంది
ఇక ఐసీఐసీఐ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీని ఇస్తోంది. ఇక సీనియర్ సిటీజన్లకు ఇది 7.2 శాతంగా ఉంది.
ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.4 శాతం ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం ఇస్తోంది. ఇక 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే కాలపరిమితి తక్కువ ఉంటే 6.7 శాతం నుంచి 7.2 శాతం వరకు వడ్డీ కల్పిస్తోంది.
ఇక ఫెడరల్ బ్యాంక్ మూడు సంవత్సరాల ఫిక్స్ డ్ డిపాజిట్లక 6.7 శాతం సాధారణ వ్యక్తులకు, సీనియర్ సిటిజన్లకు 7.2 శాతం వడ్డీ ఇస్తోంది.
మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ వ్యక్తులకు 6.3 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.8 శాతం అందిస్తోంది. ఇక రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితిపై 6.45 శాతం నుంచి 6.95 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది.
ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడు సంవత్సరాల కాలపరిమితిపై 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం అందిస్తోంది. ఇక 445 రోజు కాలపరిమితి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.5 నుంచి 7 శాతం వడ్డీ ఇస్తోంది.
ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడు సంవత్సరా డిపాజిట్‌పై 6.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.