Term Insurance: టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకునేవారు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు జాగ్రత్త

టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకువారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోయింది. ఇంతకముందు కూడా ఈ పాలసీలు ఉన్నా ఎక్కువమంది తీసుకునేవారు కాదు. కానీ ఇటీవల వీటివైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

Term Insurance: టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకునేవారు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు జాగ్రత్త
Term Insurance

Updated on: Dec 08, 2025 | 3:06 PM

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక టర్మ్ ఇన్యూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబసభ్యుల భద్రత కోసం అనేకమంది ఇప్పుడు వీటిని తీసుకుంటున్నారు. కొంతమంది మెడికల్ టెస్టులు నిర్వహించి టర్మ్ ఇన్యూరెన్స్ ఇస్తుండగా.. మరికొన్ని బీమా సంస్థలు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించకుడానే టర్మ్ ఇన్యూరెన్స్‌లు అందిస్తున్నాయి. టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకున్నవారు అకాల మరణం చెందితే కుటుంబసభ్యులకు డబ్బులు చెల్లిస్తారు. అదే పాలసీ గడువు ముగిసే సమయానికి పాలసీదారుడు బ్రతికి ఉంటే ఎలాంటి డబ్బులు రావు. కానీ ఇప్పుడు మార్కెట్లో ప్రీమియం తిరిగి చెల్లించే టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి.

టర్మ్ ఇన్యూరెన్స్‌కు పెరుగుతున్న డిమాండ్

టర్మ్ ఇన్యూరెన్స్‌కు ఇటీవల డిమాండ్ బాగా పెరుగుతోంది. కూటుంబానికి ఆర్ధికంగా భద్రత కల్పించేందుకు చాలామంది వీటిని తీసుకుంటున్నారు. బ్యాంకులతో పాటు మరికొన్ని ప్రైవేట్ బీమా సంస్థలు టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. ఈ పాలసీల్లో ప్రీమియం తక్కువగా ఉండటంతో పాటు బీమా కవరేజీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల టర్మ్ ఇన్యూరెన్స్‌ తీసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బీమా కవరేజీతో పాటు వ్యవధి ముగిశాక ప్రీమియం తిరిగి చెల్లించే పాలసీలు కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే వీటి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వాటితో పోలిస్తే రీఫండ్ వచ్చే వాటికి రెండింతల ప్రీమియం అధికంగా ఉంటుంది.

వీటిని పరిశీలించండి

టర్మ్ ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఆయా కంపెనీల క్లెయిమ్ సెటిల్‌మెంట్ల రేషియోను చెక్ చేసుకోండి. క్లెయిమ్స్ త్వరగా పరిష్కరించే కంపెనీలను మాత్రమే ఎంచుకోండి. ప్రీమియం రీఫండ్ చెల్లించే సమయంలో అదనపు ఛార్జీలు ఏమైనా వసూలు చేస్తున్నాయనేది కూడా పరిశీలించుకోవాలి. ఇందుకోసం పాలసీ డాక్యుమెంట్లను క్లియర్‌గా చదవాలి. ఇక యాక్సిడెంటల్ డెత్, క్రిటికల్ ఇల్‌నెస్, డిసేబిలిటీ బెనిఫిట్ ఉన్న పాలసీలను ఎంచుకోవడం మంచిది. ప్రీమియం సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తారా..? ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారా? లేదా నెలనెలా చెల్లిస్తారా? అనేది కూాడా ముఖ్యం. మీ ఆదాయం ఆధారంగా సరైన ఆప్షన్‌ను ఎంచుకుంటే మంచిది.