Cyber Fraud: మీ ప్రీమియం వెంటనే చెల్లించండి.. ఇలాంటి మెసెజ్‌లు మీకు వస్తున్నాయా.. ఇది వారిపనే..

|

Jan 06, 2023 | 11:34 AM

బీమా పాలసీ మోసాలు పెరుగుతున్నందున.. పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏవైనా అనుమానాస్పద SMS లేదా ఇమెయిల్‌లు వస్తే.. దయచేసి కస్టమర్ కేంద్రాన్ని కాల్ చేయండి. ఎందుకంటే..

Cyber Fraud: మీ ప్రీమియం వెంటనే చెల్లించండి.. ఇలాంటి మెసెజ్‌లు మీకు వస్తున్నాయా.. ఇది వారిపనే..
Money
Follow us on

పార్ట్‌ టైమ్‌ జాబ్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, సింపుల్‌ వర్క్‌-లక్షల్లో ఇన్‌కం, చేతిలో మొబైల్‌ ఉంటే చాలు… డబ్బే డబ్బు. ఇంకెందుకు ఆలస్యం లింక్‌ క్లిక్‌ చేయండి-లక్షలు సంపాదించండి. ఇలాంటి మెసేజ్‌లు వస్తే ఎవరు మాత్రం టెంప్ట్‌ అవ్వరు. అయితే ఇలాంటి మోసగాళ్లు మరో కొత్త దారులను ఎంచుకున్నారు. మీరు కట్టాల్సిన ఇన్సూరెన్స్ తేదీ దగ్గర పడిందని.. ఇలా కంపెనీల పేరుతో మెసెజ్‌లు చేస్తున్నారు. పొరపాటున దానిపై క్లిక్ చేయడం ఆలస్యం మీ బ్యాంక్ బ్యాలెన్స్ మయం అవుతుంది. తమ కుటుంబాల ఆర్థిక రక్షణ, అత్యవసర వైద్య అవసరాల కోసం బీమా పాలసీలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా, కరోనా కాలం తర్వాత బీమా పాలసీలు తీసుకునే యువత సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.

అదే సమయంలో బీమా పాలసీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. పాలసీదారుల్లో అవగాహన లేకపోవడమే ఇలాంటి మోసాలకు కారణం. ఈ మోసగాళ్లు పాలసీ హోల్డర్‌లకు ఫోన్ చేసి, తమ పాలసీలు రద్దు కాబోతున్నాయని బెదిరిస్తున్నారు..

క్లెయిమ్ చేయడానికి కూడా రుసుము చెల్లించాల్సిందేనని చెబుతున్నారు. బీమా కంపెనీల మాదిరిగానే వారు ఇమెయిల్‌లు, టెక్స్ట్ మెసెజ్‌లను పంపుతున్నారు. ఉదాహరణకు.. మీ ప్రీమియం వెంటనే చెల్లించండి లేదా మీ పాలసీ రద్దు చేయబడుతుంది.. అని SMSతో పాటు లింక్‌ను పంపి డబ్బును దోచెస్తున్నారు.

పాలసీ పూర్తిగా మెచ్యూర్ కావడానికి నెలల ముందు వారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీమియం చెల్లింపు కోసం బీమా కంపెనీలు అటువంటి టెక్స్ట్ మెసెజ్‌లను, ఇమెయిల్‌లను పంపవని చాలా కంపెనీలు సూచిస్తున్నాయి. మీకు అలాంటి టెక్స్ట్ మెసెజ్‌లు వస్తే, మీరు వెంటనే నిర్దిష్ట బీమా కంపెనీ కస్టమర్ సెంటర్‌ను సంప్రదించాలి.

ప్రస్తుతం మనలో చాలా మంది ఆన్‌లైన్‌లోనూ పాలసీలు తీసుకుంటున్నారు. బీమా కంపెనీని నేరుగా సంప్రదించి పాలసీలు తీసుకున్నప్పటికీ, అన్ని పాలసీలు ఎక్కువగా డిజిటల్ రూపంలో ఉంటాయి. కాబట్టి, మీరు డీమ్యాట్ ఖాతాల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ మొదలైన వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి.

ఇమెయిల్ యాడింగ్, మాల్వేర్, కీ-లాకింగ్ సాఫ్ట్‌వేర్, స్పైవేర్ మొదలైనవాటి ద్వారా, మోసగాళ్ళు పాలసీదారుల లాగిన్ వివరాలను.. పాలసీకి సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేస్తారు. కాబట్టి, బహిరంగ ప్రదేశాల్లో ఉచిత Wi-Fiని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాస్‌వర్డ్‌లను స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు. పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తూ ఉండాలి. ఉచిత Wi-Fiని ఉపయోగించి బ్యాంకింగ్, పెట్టుబడి, ప్రీమియంకు సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీలు చేయకూడదు.

మోసగాళ్లు పాలసీదారుల బంధువులను కూడా మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. తాము పాలసీదారుల నామినీలమని, పాలసీ ప్రయోజనాలకు తాము అర్హులమని చెప్పి మోసం చేస్తారు. బీమా పాలసీల ద్వారా క్లెయిమ్ చేసిన మొత్తాన్ని నగదు రూపంలో తీసుకుంటామని పేర్కొంటూ బ్యాంకు ఖాతా వివరాలతో సహా తమ వ్యక్తిగత ఆర్థిక వివరాలను అడుగుతారు. క్లెయిమ్ మొత్తాన్ని అందజేస్తామని అడ్వాన్స్ పేమెంట్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. ఏ బీమా కంపెనీ నామినీ నుంచి ఎలాంటి ఛార్జీలను అడగదు. ఇలా ఎవరినైనా సంప్రదిస్తే నేరుగా సంబంధిత కంపెనీని కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి.

సెల్‌ఫోన్‌లకు కాల్ చేసే స్కామర్‌లు “మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించండి, మీ డబ్బు రెట్టింపు అవుతుంది” వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందించి మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి కాల్‌ల విషయంలో, బీమా కంపెనీకి చెందిన అధీకృత ఏజెంట్ లేదా కస్టమర్ సెంటర్‌ను నేరుగా సంప్రదించాలి.

పాలసీ తీసుకునే ముందు మన ఆర్థిక అవసరాలకు ఏ రకమైన పాలసీ సరైనదో, దాని పూర్తి వివరాలను తెలుసుకోవాలి. తద్వారా ఇలాంటి మోసాలకు దూరంగా ఉండవచ్చు. ఏదైనా మోసం జరిగితే, వెంటనే పోలీసులకు కానీ, సంబంధిత కంపెనీకి తెలియజేయండి. బీమా పాలసీల గురించి వాటి ప్రయోజనాలతో సహా తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు బీమా మోసం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం