
Credit Card Usage: క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. క్రెడిట్ కార్డులు తీసుకోవాల్సిందిగా కస్టమర్లను బ్యాంకులు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అప్పుల భారం, అత్యవసర సమయంలో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లు కార్డులు తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డు ఉంటే మంచిదే కదా. .అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మరికొంతమంది తీసుకుంటున్నారు. కొంతమంది క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడి అప్పులపాలవుతూ ఉంటారు. కానీ తెలివిగా, స్మార్ట్‌గా వాడితే క్రెడిట్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించాలి. మినిమం డూ కాకుండా పూర్తి బిల్లు చెల్లించాలి. టైమ్‌కు బిల్లు కట్టడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ భారీగా పెరగడమే కాకుండా అప్పులపాలు కాకుండా ఉంటారు. ఫుల్ పేమెంట్ చేయకపోతే బ్యాంకులు భారీగా వడ్డీ వసూలు చేస్తాయి. అంతేకాకుండా సిబిల్ స్కోర్ పడిపోతుంది.
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా పే చేయడం వల్ల సిబిల్ స్కోర్ భారీగా తగ్గే అవకాశముంది. దీంతో మిస్ కాకుండా పేమెంట్ రిమైండర్ సెట్ చేసుకోండి. లేదా ఆటో పే ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇంకా మంచిది. దీని వల్ల ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి క్రెడిట్ కార్డు బిల్లు ఎంత అయితే ఉందో.. అంత డబ్బులు కట్ అవుతాయి.
క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడకుండా ఎప్పటికప్పుడు మీ స్టేట్మెంట్‌ను చెక్ చేసుకోండి. దీని వల్ల మీ స్పెండింగ్ హాబిట్స్ తెలిసిపోతాయి. ఇలాంటి సమయంలో మీ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఖర్చులను ట్రాక్ చేయడానికి, తగ్గించుకోవడానికి బ్యాంకులు అనేక ఆన్‌లైన్ టూల్స్‌ను తీసుకొచ్చాయి. వాటిని ఉపయోగించుకోండి.
చాలామంది బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయనే కారణంతో చాలా క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటారు. దీని వల్ల మీకే నష్టం జరుగుతుంది. క్రెడిట్ కార్డులు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా తక్కువ కాలంలో అనేక కార్డుల కోసం దరఖాస్తు చేసుసుకుంటే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కొత్త కార్డులు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు వాటిని సక్రమంగా వాడగలరో..లేదో తెలుసుకోండ ి.