New Rules: న్యూ ఇయర్ అలర్ట్.. నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి 5 కొత్త రూల్స్.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే..

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. దీంతో జనవరి 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చేశాయి. వీటి గురించి ముందుగా తెలుసుకోకపోతే చాలా నష్టం కలగొచ్చు. నేటి నుంచి చాలా బ్యాంక్ రూల్స్ మారాయి. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి.

New Rules: న్యూ ఇయర్ అలర్ట్.. నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి 5 కొత్త రూల్స్.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే..
New Rules

Updated on: Jan 01, 2026 | 8:02 PM

దేశవ్యాప్తంగా ప్రజలు 2026 ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కొత్త ఆలోచనలతో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టారు. నూతన ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా కొన్ని కొత్త నిర్ణయాలు కూడా అమల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్, ఇతర ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించి రూల్స్ నేటి నుంచి మారాయి. దేశంలోని ప్రజలందరికీ ప్రభావితం చేసే ఈ నిబంధనల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంక్ కేవైసీ నుంచి ఎల్పీజీ సబ్సిడీ వరకు చాలా మార్పులు జరిగాయి. జనవరి 1 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాంక్ అకౌంట్ కేవైసీ

బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. కేవైసీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు. ఇక నుంచి ప్రతీ 12 నెలలకు ఒకసారి కేవైసీ అనేది తప్పనిసరి. చేయికపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.

యూపీఐ లిమిట్స్

బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ తప్పనిసరిగా యూపీఐ అనేది వాడుతున్నారు. యూపీఐ యాప్స్, ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. గతంలో యూపీఐ ద్వారా రూ.లక్ష వరకు మాత్రమే పంపించే వీలు ఉండగా.. ఇప్పటినుంచి రూ.2 లక్షల వరకు పంపించుకోవచ్చు.

ఎల్పీజీ సబ్సిడీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తున్నాయి.అయితే వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే సబ్సిడీ అందనుంది. మీ బ్యాంక్ అకౌంట్ నిర్ధారణ పూర్తవ్వకపోతే సబ్సిడీ అందదు. అందుకే ఎల్పీజీ సబ్సిడీ పొందాలనుకునేవారు మీ బ్యాంక్ అకౌంట్‌ను గ్యాస్ ఏజన్సీలతో వెరిఫై చేయించుకోవాలి.

సిబిల్ స్కోర్‌లో మార్పులు

ఇప్పటివరకు కేవలం 15 రోజులకు ఒకసారి మాత్రమే సిబిల్ స్కోర్‌ను బ్యాంకులు అప్డేట్ చేసేవి. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం జనవరి 1 నుంచి వారానికి ఒకసారి బ్యాంకులు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ నెలలో 7,14,21,28వ తేదీన మన సిబిల్ అప్డే్ట్ అవుతుంది. దీని వల్ల మీరు ఈఎంఐ కట్టకపోతే వెంటనే సిబిల్ రిపోర్టులో అప్డేట్ అవ్వుతుంది. దీని వల్ల మీకు నష్టం జరుగనుంది.

ఛార్జీలు బంద్

గడువు తేదీ కంటే ముందుగానే లోన్ చెల్లించి రద్దు చేసుకోవాలనుకుంటే బ్యాంకులు కొంత మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ జనవరి 1 నుంచి ఇందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో హోమ్, కారు, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్ లాంటివి తీసుకున్నవారికి ఎలాంటి ఛార్జీలు ఉండవు